యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ సినిమాలలో నటించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది

యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ సినిమాలలో నటించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది
- ప్రముఖ సినీ నటులు శివాజీ రాజా.

సినిమాలలో నటించాలంటే  ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకోవడం ఎంతో అవసరమని సినీ నటులు శివాజీరాజా తెలిపారు.
సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన యఫ్. టి. ఐ. హెచ్. ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ) స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన కళ్ళు సినిమా ప్రీమియర్ షో కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
కళ్ళు సినిమా విడుదలై ముప్ఫై మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఎఫ్. టి.ఐ.హెచ్.వారు శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ లో కళ్ళు చిత్రాన్ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా కళ్ళు చిత్రంలో హీరోగా నటించిన శివాజీ రాజా ఎఫ్. టి.ఐ.హెచ్.విద్యార్థులతో ఆ చిత్ర విశేషాలను పంచుకున్నారు. తొలిసారిగా కెమెరా ముందు నిల్చున్నప్పుడు తన కాళ్ళు వణకడం తనకు మాత్రమే తెలుసని, అయితే నటనలో తీసుకున్న శిక్షణ ఆ భయాన్ని అధిగమించి సినీరంగంలో నిలదొక్కుకునేలా చేసిందని ఆయన తెలిపారు.ఈ చిత్రం గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు శివాజీరాజా సమాధానాలు ఇచ్చారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించిన ఎం.వి.రఘు తమను ఎంతగానో ప్రోత్సహించి తనకు కావలసిన నటనను రాబట్టుకున్నారని, అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఎఫ్. టి. ఐ.హెచ్ వంటి ప్రముఖ సంస్థలో ఎకడమిక్ డీన్  గా ఉండడం వల్ల మరెందరో అత్యుత్తమ నటులు సినీరంగానికి పరిచయం అవుతారని శివాజీరాజా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో పనిచేసిన నటులను,సాంకేతిక నిపుణులను ఎఫ్. టి.ఐ.హెచ్. మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ ఉదయ్ కిరణ్ కటకం, జురియెల్ స్టూడియోస్ సీఈఓ శ్వేత కటకం సత్కరించారు 
కళ్ళు వాసు, చిత్తరంజన్, సినీ,నవలా రచయిత నడిమింటి నరసింగరావు తదితరులు విద్యార్థులతో ముచ్చటించి తమ సినీ అనుభవాలను వివరించారు.
యఫ్. టి. ఐ. హెచ్. డీన్ మరియు కళ్ళు చిత్ర దర్శకులు ఎం.వి.రఘు కళ్ళు చిత్రం తీయడానికి పడిన శ్రమను, పొందిన ఫలితాలను గుర్తు చేసుకుని, కళ్ళు చిత్రం మరోసారి తీయాలని ఉందని,తీస్తే అందులో ఎఫ్. టి. ఐ.హెచ్.విద్యార్థులకు అవకాశం ఉంటుందని తెలిపారు.
యాక్టింగ్ ప్రొఫెసర్& పీఆర్వో. డా.శ్రీజ సాదినేని, కల్చరల్ సెక్రెటరీ హర్ష వర్ధన్, మరియు ఎఫ్. టి. ఐ.హెచ్. అధ్యాపక బృందం పాల్గొన్నారు.