వివేక విద్యా సంస్థల కీర్తి స్ఫూర్తిదాయకం

వివేక విద్యా సంస్థల కీర్తి స్ఫూర్తిదాయకం 

 - శ్రమతోనే విజయాలు దక్కుతాయి 
   ప్రతిభ చూపినవివేకసంస్థల విద్యార్థులను                 అభినందించిన 
 - ఎమ్మెల్యే శివకుమార్ 

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, తెనాలి: ప్రతి విజయం వెనుక శ్రమ దాగి ఉందని, నిరంతర సాధనతోనే లక్ష్యాలు సాధించగలరని తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక వివేక విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం ఇటీవల ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వివేక విద్యార్థుల అభినందన సభ జరిగింది. సభలో ముఖ్యఅతిధిగా అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం దక్కించుకున్న వివేక విద్యా విద్యార్థిని అమృత భార్గవికి ప్రశంసలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్ కోసం కళాశాలల ఎంపిక కీలకమని దీనిలో తల్లిదండ్రుల పాత్ర ప్రధానమని అభిప్రాయ పడ్డారు. గడచిన ఏడు సంవత్సరాలుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న వివేక విద్యాసంస్థలను, డైరెక్టర్ రావిపాటి వీరనారాయణలను అభినందించారు. కేవలం నగరాలకే పరిమితమైన కార్పోరేట్ స్థాయి విద్యను గ్రామీణ ప్రాతాలలకు విస్తరించి విద్యార్ధులలోని ప్రతిభను గుర్తించడంలో వివేక విద్యాసంస్థలకు సాటిలేదని, ఈ ఫలితాలతో స్పష్టమైనది అని అన్నారు. ఇంటర్మీడియట్ తో పాటు అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో వివేక విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభను చాటడం తెనాలి ప్రాంతానికి గర్వకారణం అన్నారు. ఎంపీసీ విభాగంలో 991 మార్కులు సాధించి ప్రధమంగా నిలిచిన యార్లగడ్డ అమృత భార్గవితో పాటు 985 మార్కులు సాధించిన టి. సుష్మ, 983 షేక్ ఆసియా, ఎస్. నిత్యశ్రీ, 980 టి. భానులను, బైపిసిలో 983 మార్కులు సాధించిన కె. ప్రియాంక, జె.ఇ. ఇ, ఐ.ఐ.టిలో ఉత్తమ ఫలితాలను సాధించిన లోకేష్ ను ఎమ్మెల్యే అభినందించారు. వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ ఈ విద్యాసంస్థల విజయానికి అంకితభావంతో, నిబద్ధతతో పనిచేస్తున్న అధ్యాపక సిబ్బంది కృషి ప్రశంసనీయం అన్నారు. కార్యక్రమంలో న్యాయవాది బుచ్చిరాజు, వన్ టౌన్ సి.ఐ చంద్రశేఖర్ రావు, వివేక విద్యాసంస్థల సిబ్బంది వెంకటరత్నం, రామరాజు, మురళీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.