టోక్యో ఒలంపిక్స్ లో ఆదరకొట్టిన మేరికోమ్

టోక్యో ఒలంపిక్స్ లో ఆదరకొట్టిన భారత్ బాక్సర్
మేరీకోమ్ 

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
టోక్యో ఒలింపిక్స్ లో ఈరోజు భారత బాక్సర్ మేరీకోమ్ అదరగొట్టింది. మహిళల ఫై వెయిట్ విభాగం (48-51 కేజీలు) రౌండ్-32 మ్యాచ్ లో మేరీకోమ్ ప్రత్యర్థిని చిత్తుచేసి రౌండ్-16లోకి అడుగుపెట్టింది. 
డొమినికన్ రిపబ్లిక్ బాక్సర్ హెర్నాండేజ్ గార్షియా మిగులీనాను 4-1 పాయింట్లతో మేరీకోమ్ చిత్తుచేసింది. జులై 29న జరిగే తదుపరి మ్యాచ్ లో మేరీకోమ్ కొలంబియాకు చెందిన వాలెన్సియా విక్టోరియా ఇంగ్రిట్ లోరెనాతో తలపడనుంది. అందులోనూ గెలిస్తే క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెడుతుంది. 
- బి. సురేష్ బాబు, 
  స్పెషల్ కరస్పాండెంట్