జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
జర్నలిస్టులకు ఉద్యోగులతోపాటు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయం ప్రభుత్వం పరిశీలిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ  ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కు హామీ ఇచ్చారు. కోవిడ్ తో మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు జర్నలిస్టులతో పాటు ఇళ్ళ స్థలాలను కేటాయిస్తామని ఈ విషయం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నదని ఆయన హామీ ఇచ్చారు.  సోమవారం ఆయనను కలిసిన ప్రతినిధివర్గం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి వివరించింది.పత్రికలకు అక్రిడిటేషన్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామని, చిన్న పత్రికలకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా విషయంలో అక్రిడేషన్లు మంజూరైన తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన  చెప్పారు. ఈరోజు ఎపిడబ్ల్యుజెఎఫ్ ప్రతినిధివర్గం ఆయనను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించింది. అంతకుముందు ప్రతినిధి వర్గం సమాచార శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసింది. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేయవలసిన వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ కమిటీ తోపాటు దాడుల నివారణ కమిటీల నియామకంపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టుల అవార్డుల విషయంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటానని కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి చెప్పారు. తిరుమల కేంద్రంల్లోని విలేకరులకు అక్రెడిటేషన్ లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ ప్రతినిధి వర్గం లో ఫెడరేషన్ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు వర్కింగ్ జర్నలిస్ట్ ఎడిటర్ ఎ అమరయ్య,  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరంట్లప్ప, విజయవాడ నగర అధ్యక్ష కార్యదర్శులు కలిమి శ్రీ ఎం బి నాధన్ తదితరులు  ఉన్నారు.