పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, 25 జూలై 2021: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును  గ్రామస్థాయిలో పరిశీలించి వాటిలో సమస్యలను సమస్యలను పరిష్కారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పేర్కొన్నారు.
ఆదివారం రాత్రి గురజాల మండలం పులిపాడు గ్రామంలోని ఆదర్శ మండల పరిషత్‌ పాఠశాలలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలలో సమస్యలను జిల్లా స్థాయి అధికారులు గ్రామస్థాయికి వెళ్ళి పరిష్కారించేందుకు పల్లెనిద్ర కార్యక్రమంని జిల్లాలో తొలుత పులిపాడు గ్రామంతో ప్రారంభిస్తున్నామన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంకు పండుగ వాతావరణం తీసుకువచ్చేలా భారీ స్థాయిలో గ్రామస్ధులు హాజరవటం సంతోషంగా ఉందన్నారు.
గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నవరత్న పథకాలు చక్కగా అమలు జరుగుతున్నాయని, పధకాల అమలును గ్రామస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కారించేందుకు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పల్లెనిద్ర కార్యక్రమంకు గ్రామానికి రావటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రానికే శివారు గ్రామమైన పులిపాడు సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తే గ్రామస్ధులకు మరింత మేలు జరుగుతుందనన్నారు. గ్రామంలో అర్హత ఉన్న 30 మందికి పెన్షన్లు మంజూరు చేయాలని జాబితాను జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌కు శాసనసభ్యులు కాసు మహేష్‌ రెడ్డి అందించారు.
సమావేశం అనంతరం ఎస్‌సీ కాలనీలో జిల్లా కలెక్టర్‌  వివేక్‌ యాదవ్, శాసనసభ్యులు కాసు మహేష్‌ రెడ్డి గ్రామస్ధులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.
కార్యక్రమంలో  జడ్పీ సీఈవో చైతన్య, డీఎంహెచ్‌వో డా. యాస్మిన్, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ మఢుసూదనరావు, డీఈవో గంగా భవానీ,   గురజాల రెవెన్యూ డివిజన్‌ అధికారి పార్ధసారధి,పోలీస్, రెవెన్యూ, పంచాయితీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.