Skip to main content

కట్టెలు కొట్టిన చేతులు ఒలంపిక్ మెడల్ అందుకున్నాయి

కట్టెలు కొట్టిన చేతులు… ఒలంపిక్ మెడల్ అందుకున్నాయి
చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
ఒలంపిక్స్! వాటిలో పాల్గొనడమే ఓ అద్భుతమైన విజయం. అలాంటిది పతకం దక్కించుకోవడం ఇంకెంత గర్వకారణమో కదా. ఆ సమయంలో జాతీయ గీతం మోగుతూ ఉంటే, ఒంటికి చుట్టుకున్న జెండా రెపరెపలాడుతుంటే… అంతకంటే గొప్ప ఉద్వేగాన్ని ఊహించగలమా! వంద కోట్లమంది భారతీయులు తల ఎత్తుకునే మన విజయాన్ని దేనితో అయినా పోల్చగలమా! అందుకే ఇవాళ మీరాబాయి సృష్టించిన చరిత్ర మనలో ప్రతి ఒక్కరికీ గర్వకారణం. ఆ ప్రస్థానం వెనుక ఉన్న ప్రయాణం మరింత స్ఫూర్తిదాయకం.
1994 ఆగస్టు 8న మణిపుర్ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు మీరాబాయి. తనది దిగువ మధ్యతరగతి కుటుంబం. కష్టపడి తీరాల్సిన బాల్యం. రోజూ కట్టెలు కొట్టుకుని వస్తే కానీ పొయ్యి వెలగదు. ఖాళీ డబ్బాలతో చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకుంటే కానీ దాహం తీరదు. మీరాబాయి తన అన్నతో కలిసి ఆ పనులు చేసేది.
మీరాబాయికి మొదటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం. కాకపోతే వాటిలో కొట్లాటలు, బట్టలు మురికి చేసుకోవడం తనకు నచ్చేది కాదు. కాస్త హుందాగా కనిపించే ఆటలు ఆడాలనుకుంది. అలా వెయిట్ లిఫ్టింగ్ ఎంచుకుంది. కానీ ఆటలో పట్టు అంత తేలికగా చిక్కలేదు. తన ఇంటి నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉన్న శిక్షణా కేంద్రానికి ఉదయం ఆరుగంటలకల్లా చేరుకోవాలి. ఆ కాస్త దూరానికీ రెండు బస్సులు మారాలి. చదువు కూడా కొనసాగించాలి. తన వెయిట్ లిఫ్టింగ్ లాగానే ఈ కష్టాలన్నింటినీ ఎత్తి అవతల పడేసింది. మీరాబాయి. ఒకో అడుగూ ముందుకు వేస్తూ జాతీయ స్థాయిలో రాణించడం మొదలుపెట్టింది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని మెడల్స్ సంపాదించినా, రికార్డులు సృష్టించిన మీరాబాయి 2016 ఒలంపిక్స్ లో మెడల్ తెస్తుందనే అనుకున్నారు అందరూ. కానీ మీరాబాయి అక్కడ దారుణంగా విఫలం అయింది. విమర్శకుల నోళ్లకు పనిపడింది. అయినా నిరాశ చెందలేదు మీరా. తన శిక్షణ కొనసాగిస్తూ, పాల్గొన్న ప్రతి పోటీలోనూ రాణిస్తూ మరో అవకాశం కోసం కాచుకుని ఉంది. టోక్యో ఒలంపిక్స్ లో అడుగుపెట్టీ పెట్టగానే… వెండి పతకం సాధించింది. 49 కిలోల విభాగంలో 202 కిలోల బరువు ఎత్తిపడేసి మెడల్ అందుకుంది.
వెయిల్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశం అందుకున్న తొలి వెండి మెడల్ ఇది. కరణం మల్లీశ్వరి తర్వాత ఒలంపిక్ మెడల్ సాధించిన రెండో వ్యక్తి మీరానే. తన విజయ యాత్ర ఇప్పుడే మొదలైంది. మార్గంలో మరెన్నో మజిలీలు, సంచలన వార్తలుగా మారబోతున్నాయి.


.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...