కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలి...

కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలి...
...వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్.

తెనాలి :స్థానిక ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా లోని ఆటోనగర్ అసోసియేషన్ హాల్ లో మంగళవారం కోవిడ్ వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరి ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆటోనగర్ లోని పలు సంస్థల యజమానులకు కార్మికులకు కోవిడ్ వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు విధిగా పాటించి కోవిడ్ నియంత్రణకు సహకరించాలని కోరారు.కోవిడ్ లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు.ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటోనగర్ వచ్చే వినియోగదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్, సభ్యులు మాలేపాటి కోటేశ్వరరావు, వైద్యాధికారి డాక్టర్ ఎమ్ అనూష, డాక్టర్ బాల ప్రభావతి ,ఆరోగ్య విస్తరణాధికారి అందే బాల చంద్రమౌళి, వైద్య సిబ్బంది ఏ రాధిక, ఎం రోహిణి,బి సుజాత, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.