Skip to main content

Posts

Showing posts from August, 2021

ఇవాళ కొంటె బొమ్మల బ్రహ్మ.. బాపు వర్ధంతి

🚩🚩 ఇవాళ కొంటె బొమ్మల బ్రహ్మ.. బాపు వర్ధంతి!🌹 . ♦నారాచీరతో వనవాసంలో ఉన్న సీతమ్మను చూపించాలన్నా…. వాలుజడతో వయ్యారాలు పోయే పడుచుల అందాలను చూపించాలన్నా…..  ♦పెళ్లిలో సిగ్గుతో తలదించుకున్న పెళ్లికూతురును వర్ణించాలన్నా అది బాపుకే సాధ్యం.  ♦ఒక్కముక్కలో చెప్పాలంటే అందమైన అమ్మాయిని వర్ణించాలంటే…..పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదు.  సింపుల్ గా బాపు బొమ్మ అంటే చాలు. అచ్చ తెలుగుదనానికి ప్రతీక …బాపు బొమ్మలు .ఇవాళ బాపు వర్ధంతి. - ♦బాపు పూర్తిపేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. 1933 డిసెంబర్ 15 న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ లో జన్మించారు. 1955లో మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. - ♦ఆంధ్రపత్రికలో కార్టూనిస్ట్ గా చేరారు. వాలుజడతో సన్నని నడుముతో.. హొయలుపోతూ మల్లెపూల దండ తయారుచేస్తున్నట్లుగా ఉండే బాపు బొమ్మ ఎవర్ గ్రీన్. 1967లో చిత్ర దర్శకుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బాపు. - ♦సాక్షి…..ఆయన తొలి సినిమా. చివరి చిత్రం…శ్రీరామరాజ్యం. మొత్తం 51 సినిమాలకు ఆయన దర్శకత్వం దర్శకుడిగా బాపుది విలక్షణ శైలి. రామాయణాన్ని ఆధారం చేసుకుని సినిమాలు తీయడంలో ఎక...

మాతృభాషలో పట్టు ఉంటేనే పరభాషా నైపుణ్యం

మాతృభాషలో పట్టు ఉంటేనే పరభాషా నైపుణ్యం  - ఎమ్మెల్యే అన్నాబత్తుని  శివకుమార్  టాలెంట్ ఎక్స్ ప్రెస్ : మాతృభాషలో పట్టు ఉన్న వారికే పరభాషల్లో నైపు ణ్యం దక్కుతుందని, తెలుగు భాషపై అనర్గళ మైన పట్టు ఉండబట్టే మాజీ ప్రధాని పీ.వీ నరసింహారావు బహుబాషా కోవిదులుగా సార్థకత చేసుకున్నారని ఎమ్మెల్యే శివ కుమార్ అన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆదివారం బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్, అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో తెలుగు బాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కవిసమ్మేళనం, తెలుగు గీతాలతో తెలుగు తల్లికి నీరాజనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు వైష్ణవి కళాశాల ప్రిన్సిపాల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ఆయన తెలుగు భాష గొప్పతనాన్ని, మాతృ భాష మాధుర్యాన్ని వివరించారు. జీవన పరిస్థితుల నేపధ్యంలో ఇతర భాషలు నేర్చుకోవాల్సి వచ్చినా మాతృభాషను విస్మరించ రాదన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గెలుపునకు తెలు గు భాషపై ఆయనకున్న పట్టే కారణమన్న సీజేఐ ఎన్వీ రమణ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మారుతున్న ప్రపం చంలో ఆంగ్లభాష...

సృజన్ కధనాయకునిగా వస్తున్న చిత్రం అప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ 3న విడుదల

టాలెంట్ ఎక్స్ ప్రెస్:  'అపుడు ఇపుడు'  సృజన్, తనీష్, హీరోహీరో యిన్లుగా యుకె ఫిలింస్ బ్యానర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణరాజు నిర్మాతలుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అపుడు ఇపుడు.. శివాజీ రాజా , పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తు న్నారు.. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.. విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేశారు.. ఈచిత్రం సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నారు. ఈ సంద్భంగా నిర్మాతలు మాట్లాడారు.. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింద న్నారు. అందరూ మా చిత్రాన్ని ఆదరించారని అన్నారు.. కాగా ఈచిత్రాన్ని దర్శకుడు చలపతి చాలా అద్భుతంగా తెరకెక్కిం చారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చేనెల 3న విడుదల చేస్తున్నామని తెలిపారు. దర్శకు డు చలపతి పువ్వల మాట్లాడుతూ చిత్రం పూర్తి హంగులతో రూపొందించబడిందన్నారు. ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.

తెలుగంటే..

తెలుగంటే...వేమన తెలుగంటే...నన్నయ తెలుగంటే...తిక్కన తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ తెలుగంటే...పోతన్న తెలుగంటే...అల్లసాని పెద్దన తెలుగంటే...ఆర్యభట్టు తెలుగంటే...త్యాగయ్య తెలుగంటే...కేతన తెలుగంటే...అన్నమాచార్య తెలుగంటే...త్యాగరాజు తెలుగంటే...తెనాలి రామకృష్ణ తెలుగంటే...పొట్టి శ్రీరాములు తెలుగంటే...అల్లూరి సీతారామరాజు తెలుగంటే...కందుకూరి వీరేశలింగం తెలుగంటే... గిడుగు రామ్మూర్తి తెలుగంటే...గురజాడ తెలుగంటే...శ్రీ శ్రీ తెలుగంటే...క్షేత్రయ్య తెలుగంటే...శ్రీనాధ తెలుగంటే...మొల్ల తెలుగంటే...కంచర్ల గోపన్న తెలుగంటే....కాళోజి తెలుగంటే...కృష్ణమాచార్య తెలుగంటే...సిద్ధేంద్ర తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకర్ణి తెలుగంటే...రాణీ రుద్రమదేవి తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు తెలుగంటే...రామలింగ నాయుడు తెలుగంటే...తిమ్మనాయుడు తెలుగంటే...రామదాసు తెలుగంటే...ఆచార్య నాగార్జున తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి తెలుగంటే...సింగేరి శంకరాచార్య తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన తెలుగంటే...విశ్వేశ్వరయ్య తెలుగంటే...బాబూ రాజేంద్రప్రసాద్ తెలుగంటే...చిన్నయ్య సూరి తెలుగంటే...సర్వేప...

మాతృభాష

మాతృభాష  అమ్మ భాష మధురం తెలుగు  వెలుగు దివ్యం అక్షరాలు సుస్వరాల రాగం జాలువారు ముత్యాల హారం శ్రీకృష్ణదేవరాయల కలం పలుకులమయం ఆముక్త మాల్యదా తెలుగు కావ్యధనం ద్రావీడభాషలో పుట్టి పెరిగింది సుకుమార తెలుగు వాణియై పలికింది కవతా ప్రవాహమై కొత్త అందాలు అద్దింది పదాల గారడి ఏదో చేసింది..॥ నన్నయ్య తిక్కన ఎఱ్ఱన  పాండిత్యమై నవ్వింది, మనుచరిత్రలో మనసుకింపై చుాసింది తెలుగు తేట నుడికార సొంపులకు ఒంపులకు వయ్యారమైంది అల్లసాని అల్లిక జిగిబిగిలో పల్లవింపైనది రామదాసు కీర్తనలై వెల్లువెత్తగా తాళ్లపాక అన్నమయ్య గేయాల అభిషేకాలే చేయగా త్యాగరాజు కృతులై మది జోల పాడగా క్షేత్రయ్య  మువ్వ గోపాలునిగా నాట్యమాడగా నండుారి ఎంకి పాటై పాడగా గిడుగు రామముార్తి ఉద్యమాల బాటలో వెలుగై నిలవగా.... రాజులు కట్టిరే నాడు సాహిత్యానికి కోట బీటలు వారుతున్నది తెలుగోడి నోట అమ్మ భాష జన్మభూమి రుణం బ్రతికింపదలచరెందుకో నేటి జనం "భాషలందు తెలుగు లెస్స" పదం ఓ అద్బుతం దుారమగుతున్నది తెలుగు దురదృష్టం  ఆంగ్లభాష పదాల వ్యామెాహం అర్ధం లేని ప్రయాస గమనం... కదులుతున్నవి కవుల కవనం కళ్లు తెరిపించాలనే విశ్వప్రయత్నం నాటికి నేటికి ...

ఘనంగా డి సి ఎస్ ఎం ఎస్ మాజీ చైర్మన్, వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తెర హెనీ క్రిస్టినా జన్మదిన వేడుకలు

టాలెంట్ ఎక్స్ ప్రెస్: హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ సతీమణి డి సి ఎస్ ఎం ఎస్ మాజీ చైర్మన్ వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తెర హెనీ క్రిస్టినా జన్మదిన వేడుకలు శనివారం తెనాలి పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నదానం, వస్త్ర దానంం, బెడ్షీట్లు, పండ్లు, రొట్టెలు, పంపిణీ చేశారు. ముందుగా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివ లింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి లో పెద్ద ఎత్తున పేదలకు ,అనాథలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ శాంతి సేవ ఆశ్రమం లో వృద్ధులకు చీరలు పంచెలు, పండ్లు ,రొట్టెలు, పంపిణీ చేశారు. అనంతరం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో తల్లి పిల్లల వార్డులో బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు బెడ్షీట్లు ,పండ్లు, రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ మార్ మాట్లాడుతూ పేదల మధ్య అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న శివ లింగేశ్వర స్వామి సేవా సమితిని ఆయన అభినందించారు. అదేవిధంగా నిరాధరణక...

తొలి కౌబాయ్ చిత్రానికి 50 ఏళ్లు

 తొలి కౌబాయ్ చిత్రానికి 50 ఏళ్లు  'మోసగాళ్లకు మోసగాడు'గా కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో తను ఎదుగుతూ, ఆధునిక సాం కేతిక పరిజ్ఞానం అందించిన హీరో కృష్ణ, ఎన్నో తొలి ప్రయోగాలకు ఆయన నాంది పలికారనే విషయం తెలిసిందే. ఆ విధంగా తొలి కౌబాయ్ చిత్రం కూడా కృష్ణ అందించిందే. ఆంగ్ల చిత్రాలు గుడ్, బాడ్ అగ్లీ, మెకన్నాస్ గోల్డ్, డాకోస్ రివేంజ్ చిత్రా ల స్ఫూర్తితో 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం రూపొందింది. కేఎస్ఆర్. దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై నేటికి (27 ఆగస్టు 1971) సరిగ్గా యాభై ఏళ్ళు. జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాల నిర్మాణం జరుగుతున్న సమయంలో 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని ప్రయోగాత్మకంగా తీశారు. కౌబాయ్ అనేది మన సంస్కతి కాదు. అందుకే ఈ సినిమా ప్రారంభించినపుడు అనేక విమర్శలు వచ్చాయని అంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయని కృష్ణ విమర్శలను లెక్కచేయకుండా సినిమా తీశారు. తన సొంత నిర్మాణ సంస్థ పద్మా లయా స్టూడియోస్ పతాకంపై కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. అలాగే సినిమా కథపై ఉన్న నమ్మకంతో 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని రంగుల్లో త...

ఈ-నారి" కార్యక్రమాన్ని ప్రారంభించిన -హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ.

*"ఈ-నారి" కార్యక్రమాన్ని ప్రారంభించిన  హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ.*  -ఏపీ లో అన్ని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీ విద్యార్థినులకు ఆన్లైన్ భద్రతకు సంబందించిన అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర మహిళా కమిషన్, సైబర్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలరోజులపాటు జరిగే "ఈ-నారి" కార్యక్రమాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ గురువారం ప్రారంభించారు. -మంగళగిరి లోని మహిళా కమిషన్ కార్యాలయం లో "ఈ-నారి" మాసొత్సవం కార్యక్రమాన్ని హోంమంత్రి పోస్టర్ ను ఆవిష్కరించి ప్రారంభించారు.  -ఈ సందర్బంగా హోంమంత్రి మాట్లాడుతూ మహిళా భద్రత కు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను మరింత పటిష్టంగా తీసుకెళ్లాలని దిశ యాప్ ను అందరు ఉపయోగించుకోవాల ని కోరారు. -వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలను స్కూల్ స్థాయి వరకు తీసుకువెళతామని ప్రతి యూనివర్సిటీ నుండి 10 వేల మంది విద్యార్థినులు ఈ సెమినార్లు, వెబినార్లు లో పాల్గొంటారని తెలిపారు. -రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మహిళా మేధావులు, ప్రమ...

పోస్టాఫీసుల్లో 34 పౌర సేవలు

పోస్టాఫీసుల్లో 34 పౌర సేవలు.. నవంబరు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి.. రాష్ట్రంలోని పోస్టాఫీసులన్నింటినీ నవంబరు నెలాఖరు కల్లా సర్వ సేవా కేంద్రాలు(సీఎస్‌సీ)గా మార్చేందుకు ఏపీ తపాలా శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో తపాలా సేవలతో పాటు 34 రకాల ఆన్‌లైన్‌ పౌరసేవలు సైతం అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే కంప్యూటర్లు అందుబాటులో ఉండి, శిక్షణ పొందిన సిబ్బంది ఉన్న 1,568 పోస్టాఫీసులను కామన్‌ సర్వీస్‌ సెంటర్లుగా మార్చేశారు. మరో 8,504 పోస్టాఫీసులను రెండు నెలల్లో సీఎస్‌సీలుగా మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తపాలా సీఎస్‌సీల్లో అందించే సేవలు.. :  పాన్‌కార్డ్‌, పాస్‌పోర్ట్‌, ఓటరు గుర్తింపు కార్డు, మొబైల్‌ రీఛార్జీలు, బీమా ప్రీమియంలు, ఆర్‌టీఏ, డీటీహెచ్‌ సేవలు, విద్యుత్తు, నీటి బిల్లులు, గ్యాస్‌ కనెక్షన్లకు దరఖాస్తు, ఫాస్ట్‌ట్యాగ్‌ సేవలు, రైలు, బస్సు, విమాన టికెట్లు, ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి యోగిమాన్‌ ధన్‌ యోజన వంటి పథకాలకు దరఖాస్తులు, సాయిల్‌ హెల్త్‌కార్డ్‌, ఆహార పదార్థాల విక్రయ లైసెన్సులు.. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యం: ‘‘తపాలా శాఖక...

బుల్లెట్ బండి @ తెనాలి మస్తాన్ బ్యాండ్

బుల్లెట్ బండి @ తెనాలి మస్తాన్ బ్యాండ్ - జానపద సంగీతంలో అద్భుతాలు సృష్టిస్తున్న మాస్టర్ బాజి టాలెంట్ ఎక్స్ ప్రెస్: అవును మీరు విన్నది నిజమే. ఇటీవల వైరల్ గా మారిన బుల్లెట్ బండి పాటకు మ్యూజిక్ అందించింది మన తెనాలి కి చెందిన బాజి. ఈ పాట రచన, గానం అద్భుతం. అంతకుమించి ఆ పాటకు బాణీ కట్టిన సంగీత దర్శకుడు ప్రతిభ, సృజనాత్మక ఇంకా అద్భుతం. జానపద సంగీతంలో ఈ పాటకు వచ్చిన స్పందన ఒక రికార్డ్. లోతుల్లోకి వెళితే ఈ పాట సంగీత దర్శకుడు షేక్ బాజి తొలుత మస్తాన్ బ్యాండ్ లొనే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది.  మస్తాన్ బ్యాండ్ అంటే దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ బ్యాండ్. తరతరాల గా వారసత్వం గా సంగీతమే నమ్ముకుని నేటికి ఈ సంస్థ కొనసాగుటూవుంది. బాజి తాత మస్తాన్, తండ్రి మీరావలి, మేనమామ పెద బాజీల నుంచి అందిపుచ్చుకున్న సంగీత పరిజ్ఞానానికి మెరుగులు అద్ది నేడు సినీ రంగం లోను రాణిస్తున్నారు మాస్టర్ జూనియర్ బాజి. అనేక హిట్ ప్రవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లకు, పలు సినిమాలకు సంగీతం అందించారు బాజి. వృత్తిరీత్యా హైదరాబాద్ లో సొంత రికార్డింగ్ స్టూడియో నెలకొలపారు. జన్మస్థలంపై ఎంతో అభిమానం చూపించే బాజి ఇ...

టాలెంట్ ఎంత ఉన్నా శిక్షణ తీసుకుంటేనే సినీరంగంలో రాణించగలం

టాలెంట్ ఎంత ఉన్నా శిక్షణ తీసుకుంటేనే సినీరంగంలో రాణించగలం  - ప్రముఖ సినీ నటులు,దర్శకులు ఆదిత్య ఓం. టాలెంట్ ఎక్స్ ప్రెస్: సినీ రంగంలో రాణించాలంటే కఠోర సాధన, నటనలో శిక్షణ చాలా ముఖ్యమని, అందుకోసం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకోవడం ఎంతో అవసరమని సినీ నటులు, దర్శకులు తెలిపారు. సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన యఫ్. టి. ఐ. హెచ్. ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ) యాక్టింగ్ స్టూడెంట్స్ సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆదిత్య ఓం ముఖ్య అతిథిగా విచ్చేశారు.  "తెలుగు,తమిళ,హిందీ, ఇంగ్లీష్ భాషలలో కలిపి దాదాపు 30కి పైగా చిత్రాలలో నటించడమే కాకుండా రచన, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టిన తాను కూడా ఒకప్పుడు యాక్టింగ్ స్టూడెంట్ నే అని, ఆ తర్వాత యాక్టింగ్ టీచర్ గా కూడా క్లాసెస్ చెప్పానని ఆదిత్య ఓం తెలిపారు. విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. పెద్ద పెద్ద దర్శకులతో కలిసి పనిచేయడం తన అదృష్టమని, ఇప్పుడు కూడా దర్శకులు నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ నటనను రాబట్టుకుంటున్నారు అని, భయాలు, అనుమానాలు వదిలి సినీరంగంలో ప్రయత్నాలు కొన...

ప్రభుత్వ చిత్రలేఖన పరీక్షల్లో తెనాలి విద్యార్థుల ప్రతిభ

టాలెంట్ ఎక్స్ ప్రెస్: ప్రభుత్వ చిత్రలేఖన పరీక్షల్లో తెనాలి విద్యార్థుల ప్రతిభ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్ పరీక్షలలో తెనాలి విద్యార్థుల ప్రతిభ కనబరిచారు.  ఏప్రిల్ 2021 న నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ & హయ్యర్ గ్రేడ్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల చేశారు.  ఈ ఫలితాలలో పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రలేఖనోపాధ్యాయులు పణిదెపు వెంకట కృష్ణ దగ్గర శిక్షణ తీసుకున్న తెనాలి విద్యార్థులు లోయర్ గ్రేడ్ నందు చింతక్రింది ప్రియాంక (ప్రధమ శ్రేణి), పిల్లలమర్రి బాల త్రిపుర సుందరి (ద్వితీయ శ్రేణి), పల్లపోతు వాసవి (ద్వితీయ శ్రేణి), కె. ప్రత్యూష( ద్వితీయ శ్రేణి), ఉల్లగంటి మనీషా (ద్వితీయ శ్రేణి), మఱియు హయ్యర్ గ్రేడ్ నందు ch. కుశల్ మణిదీప్(ప్రథమ శ్రేణి), తడివాక పవన్ సాయిమధు (ద్వితీయ శ్రేణి), పులిపాటి లేఖనా గాయత్రి (ద్వితీయ శ్రేణి)లో ఉర్తీర్ణత సాధించారు. వీరిని డ్రాయింగ్ మాస్టర్ కృష్ణ మరియు ఉపాధ్యాయులు అభినందించారు.   పి. వెంకట కృష్ణ,(తెనాలి) డ్రాయింగ్ మాస్టర్, సెల్:9848811668

విద్యార్థుల కోసం విభిన్న కార్యక్రమాలు చేసే ఘనత ఎఫ్. టీ.ఐ.హెచ్ కి దక్కుతుంది

విద్యార్థుల కోసం విభిన్న కార్యక్రమాలు చేసే ఘనత ఎఫ్. టీ.ఐ.హెచ్.దే.. _ కెనాన్ మెంటార్, సీనియర్  ఫోటో గ్రాఫర్, ధనిశెట్టి రాంబాబు. ఆర్ట్ అండ్ టెక్నాలజీ సమపాళ్ళలో ఉంటేనే ప్రొఫెషన్ లో రాణించ గలరని కెనాన్ మెంటార్ ధనిశెట్టి రాంబాబు అన్నారు  వరల్డ్ ఫోటోగ్రఫీ డే,ఆగస్ట్ 19 సందర్భంగా ఎఫ్. టీ.ఐ.హెచ్.వింటేజ్ కలెక్షన్ ఆఫ్ కెమెరాస్ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆయన విచ్చేశారు. శ్రీ సూర్య ఫోటో స్టూడియో ,విజయవాడ అధినేత,కీ. శే. శ్రీ. యస్. సింహాచల రెడ్డి కలెక్ట్ చేసిన  డిఫరెంట్ స్టిల్ మరియు వీడియో కెమెరాలను ఎఫ్. టీ.ఐ.హెచ్. ఎగ్జిబిషన్ పెట్టగా రాంబాబు ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ కెమెరాలు అన్నీ 1915 నుండి 1997 వరకు ఉన్న  పురాతన కెమెరాలు కావడం విశేషం. 200 మందికి పైగా విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్ ను తిలకించారు.  విద్యార్థుల కోసం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న ఎఫ్. టీ. ఐ.హెచ్.యం. డీ మరియు సీఈవో ఉదయ్ కిరణ్ కటకం ను రాంబాబు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి తన అనుభవాన్ని వారితో పంచుకున్నారు. సీనియర్ సినిమాటోగ్రాఫర్, సినీ దర్శకులు, ఎకడమిక్స్ డీ...

ఫొటో..

ఫోటో.. సుందరలోకాన్ని కన్నులకింపుగా చేస్తుా, కదులుతున్న కాలంలొ కధలన్ని చుాపిస్తుా, కదులుతున్నది  ఓ సుందర రుాపం...... అందాలని బంధాలని బందిస్తుా సంతోషాలను దుఃఖాలను చుాపేస్తుా పుట్టుక చావుల చిత్రాలతో మనసు కరిగించేస్తుా ప్రకృతి ప్రళయాలను కన్నుల ముందు ఉంచేస్తుా..... రాతలను గాధలను బద్రం చేస్తుా అల్లరిని అనుభుాతులని అద్దం పట్టేస్తుా వాస్తవాలను గతాలను చక చక తిపేస్తుా నిజాలను అబద్ధాలను నిజాయితిగా నిరుాపిస్తుా..... శోధనలను పరిశోధనల యందు ముందుకు అడుగేస్తుా చరిత్రను వాస్తవ ప్రపంచానికి అందిస్తుా వడలిపోక సోలిపోక నిత్య కాంతితో పయనిస్తుా.... ఎన్నెన్నో రుాపాలను కన్నుల ముందు నిలిపే సాక్షమై రేపటి తరాలకు పాఠమై మరోచరిత్రకు ముాలమై నిత్యజీవనంలో సత్యశోదనై నిలిచేదే ఈ హీరో  మన హీరో            "కెమెరా"           అరుణ సందడి✍  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు ..

ఫోటోగ్రఫీలో లైటింగ్ ప్రక్రియ ఆధునిక పుంతలు తొక్కుతోంది

ఫోటోగ్రఫీలో లైటింగ్ ప్రక్రియ కొత్త పుంతలు తొక్కుతుంది    -సచిన్ భరద్వాజ్  టాలెంట్ ఎక్స్ ప్రెస్: ఎఫ్.టి.ఐ.హెచ్. మీడియా కాలేజీ వేదికగా జరిగిన మ్యాజికల్ లైటింగ్ విత్ గోడాక్స్ వర్క్ షాప్ పలువురిని ఆకర్షించింది. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గోడాక్స్ మెంటర్ సచిన్ భరద్వాజ్ ఎఫ్.టి.ఐ.హెచ్ విద్యార్థులకు గోడాక్స్ లైట్స్ యొక్క విశిష్టతను తెలిపారు. ఎలాంటి ఫోటోస్ కావాలంటే ఎలాంటి లైటింగ్ ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకుంటే అవుట్ పుట్స్ వస్తాయి అనే అంశాలను ప్రాక్టికల్ గా చేసి చూపించారు. మనం తీసే ఫోటోస్ ఎలా ఉండాలో ముందుగానే ఊహిస్తే మనం అనుకున్నది అనుకున్నట్టు రిజల్ట్స్ ఉంటాయని సచిన్ తెలిపారు. ఎఫ్.టి.ఐ.హెచ్ తో తన అనుబంధం గురించి వివరిస్తూ ఎఫ్.టి.ఐ.హెచ్  తన విద్యార్థుల కోసం ఎన్నో రకాల కొత్త ఆలోచనలు చేసి, వాటిని ఆచరణలో పెట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుందన్నారు. ఖర్చుకి వెనకాడకుండా విద్యార్థులకు మెరుగైన విద్య, సరైన ప్రాక్టికల్ సెషన్స్ ఏర్పాటుచేయడం ఒక్క ఎఫ్.టి.ఐ.హెచ్ కి మాత్రమే సాధ్యమైందన్నారు. 70 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ క...

తెనాలి లో ఘనంగా జాతీయ జెండా పండుగ ...

 ప్యారిస్ లో వాడవాడలా జాతీయ జెండా పండుగ ... టాలెంట్ ఎక్స్ ప్రెస్: కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా దేశం మొత్తం పండుగలా జరుపుకునే రోజే మన ఈ స్వాతంత్ర్య దినోత్సవం. ఆదివారం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రాప్యారిస్ గా పేరుగాంచిన తెనాలి పట్టణం లో వాడ వాడలా ఘనంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, రాజకీయ పార్టీల కార్యాలయాలలో దేశభక్తి మరియు జాతీయ భావాలతో మువ్వన్నెల త్రివర్ణ పతాకాలు ఆవిష్కృతమయాయి. పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొని ఉంది. న్యాయస్థానప్రాంగణంలో: కొత్తపేటలోని న్యాయస్థానాల ప్రాంగణంలో 75వ  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పదకొండవ అదనపు ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి జి.మాలతి మరియు తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్ లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఎన్ సి సి క్యాడెట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. న్యాయదేవత విగ్రహానికి పూలమాలలు వేశారు. సీనియర్ సివిల్ న్యాయమూర్తులు గీత, శ్రీరామచంద్రుడు, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు రహమతుల్లా, అబ్దుల్ షరీఫ్,సీత మరియు బార్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ కుమార్, కార్యవర...

సృష్టి ఆర్ట్ అకాడమీ కి సూరో భారతి సంగీత కళా కేంద్రం గుర్తింపు

సృష్టి ఆర్ట్ అకాడమీ కి సూరో భారతి సంగీత కళా కేంద్రం గుర్తింపు టాలెంట్ ఎక్స్ ప్రెస్:  ఒంగోలుకి చెందిన సృష్టి ఆర్ట్ అకాడమీ గత 19సంవత్స రాలుగా ఎంతోమంది చిత్రకారులను తయారు చేసి, పెయింటింగ్ లో ప్రపంచ రికార్డులను సాధించింది. కళారంగం లో చేస్తున్న సేవలకు గాను వెస్ట్ బెంగాల్, హుబ్లీ కి చెందిన సూరో భారతి సంగీత కళాకేంద్రం సృష్టి అకాడమీ నిర్వాహకులను గుర్తించి వారిని అభినందించింది. ఆకాడమికి ఆఫ్ఫ్లియేషన్ సర్టిఫికెట్,సంగీత కళా కేంద్రం అనుబంధ ప్రశంసా పత్రాన్ని అందజేసింది.  సంగీత కళా కేంద్రం అందించిన సర్టిఫికేట్ లను శుక్రవారం రాష్ట్ర దృశ్య కళల అకాడమీ చైర్మన్ గుడిపూడి సత్య శైలజ భరత్  చేతుల మీదుగా అకాడమీ నిర్వాహకులు తిమ్మిరి రవీంద్ర కు ఆమె పత్రాలను అందచేసి అభినందించారు. చిత్రకారులన ప్రోత్సహిస్తామన్నారు. ఆర్ట్ అకాడమీ  నిర్వాహకులు షిల్డ్ ను  ఆమెకు అందచేశారు. సందర్భముగా తిమ్మిరి రవీంద్ర ను చిత్రకారుడు వై. యస్. బ్రహ్మం, నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి టి. భానుచందర్, సింగమనేని సురేష్, తునుగుంట నాగమణి, బత్తుల మంజు వాణి, చెరువు శ్రీలక్ష్మి, డైమండ్ 9 మేనేజింగ...

సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో శిల్పకళా ప్రదర్శన

 ఎక్స్ ప్రెస్: ఆగస్టు 15 భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి కి చెందిన సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వ రరావు, రవిచంద్ర, శ్రీ హర్ష లు స్వాతంత్ర సమరయోధుల, భారత దేశానికి తమ సేవలు అందించిన సంఘసంస్కర్తల ,రచయితల విగ్రహాలను శిల్పశాల ముందు ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. అతిధులుగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ కాలేదా నసీమలు ప్రదర్శన ప్రారంభించారు. స్వాతంత్రం ఆర్జించి పెట్టిన త్యాగధనుల, వారి త్యాగాలను గుర్తుకువచ్చే విధముగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసిన సూర్య శిల్పశాల నిర్వాహకులు శిల్పి కాటూరి  వెంకటేశ్వరరావు, రవిచంద్రలను శివకుమార్ అభినందించారు.

కళాకారులుగా జన్మించరు, తయారు చేయబడతారు

కళాకారులుగా జన్మించరు, తయారు చేయబడతారు    -సినీ నటి డా. శ్రీజ సాదినేని కళాకారులు అంటూ స్వతహాగా తల్లి గర్భంలో నుండి వచ్చేయరని, సరైన గురువు చేతిలో పడితే మామూలు మనుషులు సైతం మహానుభావులు కాగలరు అని ప్రముఖ సినీ,టీవీ,రంగస్థల నటి డా. శ్రీజ సాదినేని తెలిపారు. ఆదర్శ కళా నిలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులోని నాంపల్లిలో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోనీ నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, యాక్టింగ్ ఫ్యాకల్టీ గా, యాంకర్ గా.. విభిన్న రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తూ కళారంగంలో ధృవ తారగా వెలుగొందుతున్న ఆమెను ఆదర్శ కళానిలయం సంస్థ ఆదర్శ కళా ప్రతిభా అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా డా.శ్రీజ సాదినేని మీడియాతో మాట్లాడారు. చిన్నతంలోనే హరికథా కళాకారిణిగా కళారంగం లోకి ప్రవేశించిన తనకు తొలి గురువు తన తండ్రి,కీ. శే. సాదినేని నాగేశ్వర రావు అని, ఆ తర్వాత సంగీతంలో, నాట్యంలో, నటనలో, రచనలో, దర్శకత్వంలో ఎందరో గురువులు ఎన్నో మెళకువలు నేర్పారని, ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణమై...

అవయవదానం

అవయవదానం💕 మారుతున్న కాలంలో మర్మంగా దాగిన సత్యంలో మంచితనం మహోపకారమై!... నవ్వుతున్న గుండే మరో మనిషికి లయలై హృదయ సంగీతమై రాగాలే తీయదా!.... తరిగిపోయె జీవితాన వెలుగులే నింపదా పరుగుల కాలాన్ని ఆపమంటుా మరింత బంధాలను కలపమంటుా!... కన్నులను ముాయకురా లేనివాడి చుాపువై మేలుకొలుపు నీవుకావా! శరీర భాగాలన్ని దేవాలయమేగా మరొకరి బాగుకై బ్రతికేస్తుా! లేనివారు కనుమరుగైనా  దానరుాపమై మన కన్నుల గాంచమా ప్రేమను పంచమా పచ్చపచ్చని కాంతులతో వెచ్చవెచ్చని చెలిమి చేస్తుా! బ్రతికించవా మరెందరికో జీవం పొస్తుా మహామనసు నీదంటుా మరెందరో కుటుంబాల కంటనీరు తుడుస్తుా అలసిన మనసులకు ఊరటనిస్తుా.... పుణ్యమంతా నీదిగా అవయవదానమెంతో గొప్పగా! చేయుాతనిద్దాం! వెలుగులో ఓ చిరుదివ్యగా ఆలంబనై!...                          అరుణ సందడి✍

విశ్రాంత అధ్యాపక సంఘ ఆవిర్భావం

విశ్రాంత అధ్యాపక సంఘ ఆవిర్భావం      - అధ్యక్షురాలిగా కె. అనిల కుమారి టాలెంట్ ఎక్స్ ప్రెస్: జిల్లా ప్రభుత్వ కళాశాలల విశ్రాంత అధ్యాపక సంఘ అధ్యక్షురాలిగా కె. అనిల కుమారి, కార్యదర్శిగా కేఈ ప్రసాద్ ఎన్నికయ్యారు. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో మంగళవారం జిల్లా సంఘ ఆవిర్భావ సమావేశాన్ని నిర్వ హించారు. ఈసందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కృష్ణ మాట్లాడుతూ 2016 యూజీసీ వేతనాలు అమలు చేసేందుకు సంఘం చేసిన కృషిని, సాధించాల్సిన అంశాలను వివరించారు. శాఖ కోశాధికారిగా పి. జయశ్రీ, కార్యనిర్వాహక సభ్యులుగా సీహెచ్ సుశీ లమ్మ, నాగేంద్రసాయి, రవిబాబు ఎన్నిక య్యారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన సలహాదారు ఆంధోనీ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దాలనేది సి.ఎం లక్యం

హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి  లక్ష్యం!   చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.  మంగళవారం BRK భవన్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలు, ఇతర అంశాలపై  మంత్రి శ్రీనివాస్ యాదవ్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ తో కలిసి అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవి గుప్తా, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, విద్యుత్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, లా సెక్రెటరీ సంతోష్ రెడ్డి, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతు ప్రసాద్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు నారాయణ దాస్ నారంగ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు మురళి మోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అద్యక్షులు C.కళ్యాణ్, సెక్రెటరీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్న...

ఆటోలో టాయ్ లెట్ -ప్రపంచం దృష్టికి ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహిళ

ఆటోలో టాయ్ లెట్  -ప్రపంచం దృష్టికి ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహిళ ఆటో అంటే ప్యాసింజర్స్ కోసం వాడటం చూశాం.. చెత్త తీసుకెళ్లే ఆటో చూశాం.. ట్రాన్స్ పోర్ట్ ఆటో చూశాం.. బిజినెస్ కోసం ఉపయోగించటం చూశాం.. ఆటోలో టాయ్ లెట్ ఏర్పాటు చేయటం ఎప్పుడైనా చూశాం.. ఇప్పటి వరకు చూడలేదు.. ఇప్పుడు దీన్ని సాధ్యం చేసింది హైదరాబాద్ కు చెందిన మహిళ. షీ టాయ్ లెట్ పేరుతో.. ఆటోలో క్లీన్ టాయ్ లెట్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నగర వీధుల్లో తిరుగుతున్నాయి ఇప్పుడు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం.. సృజనాత్మకంగా తయారైన ఈ టాయ్ లెట్ ఆటో విశేషాలు తెలుసుకుందాం… సుష్మ కల్లెంపూడి అనే మహిళ.. 2017లో అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చింది. హైదరాబాద్ లో మహిళలు బయటకు వెళ్లినప్పుడు టాయ్ లెట్ కోసం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆవిష్కరణ చేసింది. ఓ ఆటోను మొబైల్ షీ టాయ్ లెట్ మార్చింది. ఈ ఆటోను జీహెచ్ఎంసీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చూపించింది. మొబైల్ షీ టాయ్ లెట్ వల్ల రద్దీ ప్రాంతాల్లో మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని.. పర్యావరణ హితంగా పని చేస్తాయని గుర్తించిన ప్రభుత్వాలు.. ఇలాంటి ఆటోలను మరిన్ని ఏర్పాటు చేయటానికి ప్రోత్సహిస్తు...

సినీ తారల అందానికి మేకప్ తప్పనిసరి - సినీ మేకప్ మెన్ మురళి

సినీ తారల అందానికి మేకప్ తప్పనిసరి      - సినీ మేకప్ మెన్ మురళి  ఎంత అందమైన వారికైనా కెమెరా ముందుకు వెళ్ళేటప్పుడు మేకప్ తప్పనిసరిగా చేయడం వల్ల అదనపు అందం, ఆకర్షణ వస్తుందని, అయితే వారి స్కిన్ టోన్ కి సరిపడే మేకప్ వాడాలని, అప్పుడే లైటింగ్ మరియు కెమెరా పనితీరుతో వారిని తెరపై అత్యద్భుతంగా చూపించగలమని సినీ మేకప్ మెన్ మురళి తెలిపారు. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ తమ విద్యార్థులకు అన్ని విభాగాల మీద అవగాహన పెంచేందుకు  ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తోంది . ఇందులో భాగంగా విద్యార్థుల కోసం స్పెషల్ మేకప్ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సినీ,టీవీ మేకప్ మెన్ పి.మురళి అతిథిగా పాల్గొన్నారు. నలభై సంవత్సరాల తన సినీ మేకప్ అనుభవం లో తాను నేర్చుకున్న ఎన్నో విషయాలను, మెళకువ లను ఎఫ్.టి.ఐ.హెచ్.  విద్యార్థులకు మురళి భోదించారు.  సినిమాకి వాడే మేకప్ మీద కూడా  అవగాహన ఉండాలని ఆయన విద్యార్థులకు తెలియజేసారు. అన్ని  రకాల మేకప్ లు, హెయిర్ స్టైల్స్ గురించి విద్యార్థులకు వివరిస్తూ, ఆ మేకప్ లను వేసి, హెయిర్ స్టైల్స్ ను చూపించి, ...

మోదుకూరి జాన్సన్ రచించిన సినీ పాటల ఆడియో సిడీని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

టాలెంట్ ఎక్స్ ప్రెస్: సంచలన సినీ రచయిత మోదుకూరి జాన్సన్  రచించిన సినీ పాటల ఆడియో సిడీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. జాన్సన్ గారి  జయంతి సందర్భంగా ఆదివారం మోదుకూరి జాన్సన్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుంటూరు కృష్ణ ఈ కార్యక్రమం నిర్వహించారు. వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మేరుగు నాగార్జున గారు, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు గారు,రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ వై.నాగిరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే జియావుద్ధీన్ గారు తదితరులు పాల్గొన్నారు. జాన్సన్ గారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావటానికి కృషి చేస్తున్న గుంటూరు కృష్ణను సజ్జల రామకృష్ణారెడ్డి గారు అభినందించారు.* *కార్యక్రమ విజయవంతానికి సహరించిన శాసనసభ్యులు నాగార్జున గారికి కృతజ్ఞతలు.*

తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోషియేషన్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ పోటీలు

సెప్టెంబరు 24, 25న షార్ట్ ఫిల్మ్ పోటీలు

సెప్టెంబరు 24, 25న షార్ట్ ఫిల్మ్ పోటీలు     యువత ముందుకు రావాలి  - తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ పిలుపు  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యాన సెప్టెంబరు 24, 25 తేదీల్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివిరాజు తెలిపారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో పోటీల బ్రోచర్లను అసోసియేషన్ నాయకులు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డివి రాజు మాట్లాడుతూ సెప్టెంబరు 24న ప్రముఖ దర్శక, నిర్మాత, పత్రిక సంపాదకులు చక్రపాణి (ఆలూరు వెంకటసుబ్బారావు) వర్ధంతి, 25న గానగంధర్వుడు ఎసిపి బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని  పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బికెఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పోటీలకు వచ్చిన వీడియోలన్నిటిలో ఉత్తమమైన 40 వీడియోలను 24, 25 తేదీల్లో ఎంబి విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి 8 గంటల వరకు ప్రదర్శిస్తామని అన్నారు. వాటిలో 5 ఉత్తమమైన వీడియోలకు నగదు రూ. 5 వేలు, జ్ఞాపిక, సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ...

ఒలింపిక్ అథ్లెటిక్స్ విభాగంలో భారత్ కు తొలిసారి పసిడి పతకం సాధించిన నీరజ్ చోప్ర

ఒలింపిక్ అథ్లెటిక్స్ విభాగంలో భారత్ కు తొలిసారి పసిడి పతకం సాధించిన నీరజ్ చోప్డా... ఒలింపిక్ అథ్లెటిక్స్ విభాగంలో తొలిసారి బంగారు పతకాన్ని సాధించి భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేసాడు జావలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్డా.టోక్యో లో జరుగుతున్న ఒలిం పిక్ గేమ్స్ జావలిన్ త్రో ఫైనల్స్ లో 87.58 మీటర్ల దూరం విసరి స్వర్ణాన్ని సాధించాడు. 1900 వ సంవత్సరం నుండీ జరిగిన అన్ని ఒలింపిక్ గేమ్స్ లో భారత్ కు అథ్లెటిక్స్ లో పసిడి పతకం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఆగస్టు 16 నుండి క్లాస్ లు ప్రారంభం

ఆగస్టు 16 నుండి క్లాస్ లు ప్రారంభం      - డైరెక్టర్ : కంచర్ల రాజశేఖరబాబు

పి.టి. ఉష తో సింధు

పి.టి. ఉష 18 సంవత్సరాల పూర్వం జరిగిన ఒక సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. 2001 లో హైద్రాబాద్ లో అల్ ఇండియా రైల్వే మీట్ స్పోర్ట్స్ టోర్నమెంట్  జరిగింది. సింధు తండ్రి రైల్వేశాఖ లో పనిచేశారు.ఆయన వాలీబాల్ ప్లేయర్ కూడా.నేను బయట హోటల్స్ లోనే బస చేస్తాను. కానీ హైద్రాబాద్ లో జరిగిన ఈ టోర్నమెంట్ కు వెళ్ళినప్పుడు మాత్రం సింధు కుటుంబంతో ఉన్న పూర్వ పరిచయం కారణంగా వారి ఇంట్లోనే 3,4 రోజులు బస చేసాను.నా ఒడిలో కూర్చుని ఉన్న ఈ సింధు అప్పుడు చిన్నపిల్ల.

సుకుమార్ నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభం

సుకుమార్ నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభం క్రియేటివ్ దర్శకుడు సుకుమార్  తన సొంత గ్రామమైన మట్టపర్రులో  తండ్రి కీ.శే. బండ్రెడ్డి తిరుపతినాయుడు పేరు మీద పాఠశాల భవనం నిర్మించారు. ఈ భవనం ఆగస్ట్ 1, ఆదివారం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమంలో  సుకుమార్‌తో పాటు, ఆయన సతీమణి తబిత, ప్రముఖ రాజకీయ నాయకులు, సన్నిహితులు,స్నేహితులు పాల్గొన్నారు. కాగా, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరత లేకుండా గ్రామంలో రూ. 40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించిన సుకుమార్, ఇప్పుడు ఈ పాఠశాల భవనం నిర్మించడంతో గ్రామ ప్రజలంతా సుకుమార్ కు  కృతజ్ఞతలు తెలిపారు.

టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇన్స్టిట్యూట్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది..

టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇన్స్టిట్యూట్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది: సీనియర్ సినీ సౌండ్ ఇంజినీర్ రాజశేఖర్ టెక్నాలజీ పెరుగుతున్న ఈరోజుల్లో టెక్నికల్ కోర్సులు నేర్చుకోవడం వల్ల అవకాశాలు అందుకోవడం తేలిక అవుతుంది అని ప్రముఖ సినీ సౌండ్ ఇంజనీర్ రాజశేఖర్ తెలిపారు. సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన యఫ్. టి. ఐ. హెచ్. ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ) స్టూడెంట్స్ కోసం నిర్వహించిన స్పెషల్ వర్క్ షాప్ లో రాజశేఖర్ అతిథిగా పాల్గొన్నారు.  "సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత ఏంటి ?" అనే అంశంపై జరిగిన ఈ వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ..   ఒకప్పుడు సినీరంగంలో అవకాశాలు దక్కడం చాలా కష్టంగా ఉండేదని, ఇప్పుడు ఓటీటీలు, యూ ట్యూబ్ లు కూడా వచ్చాక అవకాశాలు పెరుగుతున్నాయని, చక్కగా శిక్షణ తీసుకుంటే అవకాశాలు మనను వెతుక్కుంటూ వస్తాయని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు.  5.1 మరియు 7.1 కు ఉన్న ప్రాధాన్యత, వ్యత్యాసం, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రాముఖ్యత గురించి ఎన్నో విషయాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఎఫ్. టి. ఐ.హెచ్. యాక్టింగ్ విద్యా...

నేడు భారత త్రివర్ణ పతాక రూపకర్త పింగళ వెంకయ్య జయంతి

భారత జాతీయ పతాకానికి సెల్యూట్ చేసినప్పుడల్లా వీరు గుర్తుకు వస్తారు.నేడు ఆగస్టు 2 భారత త్రివర్ణ పతాక రూపకర్త పింగళ వెంకయ్య  జయంతి. జాతీయ త్రివర్ణపతాక నిర్మాత, స్వాతంత్య్ర యోధుడు, *వ్యవసాయ శాస్త్రవేత్త,* సాహితీవేత్త, బహుభాషా నిష్టాతుడైన *ఆంధ్ర శిరోరత్నం పింగళ వెంకయ్య 1878వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన కృష్ణాజిల్లా దివిసీమలోని *భట్ల తెనుమర్రులో* హనుమంతురావు దంపతులకు జన్మించాడు. వెంకయ్య ప్రాధమిక విద్య పెద్ద కళ్లేపల్లిలో జరిగింది. 1890వ సంవత్సరంలో లోయర్‌ సెకండరీ విద్యలో ఉత్తీర్ణుడయ్యాడు. బందరులో హింధూ హైస్కూల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. విద్యా కాంక్ష వల్ల ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం వదలి శ్రీలంకకు వెళ్లి కొలంబోలోని సిటీ కళాశాలలో చేరి రాజకీయ ఆర్ధిక శాస్త్రాలలో ఉత్తీర్ణుడయ్యాడు. లాహోర్‌ వెళ్లి దయానంద ఆంగ్లోవేదిక్‌ కళాశాలలో సంస్కృతం, ఉర్ధూ, జపాన్‌ భాషలను సమర్ధంగా అభ్యసించాడు.                                               ఈ భాషల్లో ఏకధారగా, గంభీరంగా ఉపన్యాసాలు చేసేవాడు. తన...