సెప్టెంబరు 24, 25న షార్ట్ ఫిల్మ్ పోటీలు

సెప్టెంబరు 24, 25న షార్ట్ ఫిల్మ్ పోటీలు 

  యువత ముందుకు రావాలి 
- తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ పిలుపు 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యాన సెప్టెంబరు 24, 25 తేదీల్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివిరాజు తెలిపారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో పోటీల బ్రోచర్లను అసోసియేషన్ నాయకులు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డివి రాజు మాట్లాడుతూ సెప్టెంబరు 24న ప్రముఖ దర్శక, నిర్మాత, పత్రిక సంపాదకులు చక్రపాణి (ఆలూరు వెంకటసుబ్బారావు) వర్ధంతి, 25న గానగంధర్వుడు ఎసిపి బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని 
పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బికెఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పోటీలకు వచ్చిన వీడియోలన్నిటిలో ఉత్తమమైన 40 వీడియోలను 24, 25 తేదీల్లో ఎంబి విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి 8 గంటల వరకు ప్రదర్శిస్తామని అన్నారు. వాటిలో 5 ఉత్తమమైన వీడియోలకు నగదు రూ. 5 వేలు, జ్ఞాపిక, సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్ రానున్నారని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అసోసియేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొప్పుల అశోక్ ఆనంద్ మాట్లాడుతూ షార్ట్ ఫిల్మ్ నిడివి 10 నిమిషాలకు మించకూడదని, కులమతాలకు అతీతంగా, అశీలతకు తావులేకుండా ఉండాలని తెలిపారు. గతంలో పంపినవి కాకుండా కొత్త వీడియోలను మాత్రమే పంపాలని సూచించారు. పోటీలకు ఎంట్రీ ఫీజు లేదని పేర్కొన్నారు... 
సెప్టెంబరు 15లోపు వీడియోలను telugusfa@gmail.comకు పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9391163508, 9440497672కు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వలీనాగరాజు, ఆర్. రాజశేఖర్, దగాని కిరణ్, గాదె సుబ్బారెడ్డి, ఆడారి సురేంద్రకుమార్ పాల్గొన్నారు.