తొలి కౌబాయ్ చిత్రానికి 50 ఏళ్లు

 తొలి కౌబాయ్ చిత్రానికి 50 ఏళ్లు 


'మోసగాళ్లకు మోసగాడు'గా కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో తను ఎదుగుతూ, ఆధునిక సాం కేతిక పరిజ్ఞానం అందించిన హీరో కృష్ణ, ఎన్నో తొలి ప్రయోగాలకు ఆయన నాంది పలికారనే విషయం తెలిసిందే. ఆ విధంగా తొలి కౌబాయ్ చిత్రం కూడా కృష్ణ అందించిందే. ఆంగ్ల చిత్రాలు గుడ్, బాడ్ అగ్లీ, మెకన్నాస్ గోల్డ్, డాకోస్ రివేంజ్ చిత్రా ల స్ఫూర్తితో 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం రూపొందింది. కేఎస్ఆర్. దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై నేటికి (27 ఆగస్టు 1971) సరిగ్గా యాభై ఏళ్ళు. జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాల నిర్మాణం జరుగుతున్న సమయంలో 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని ప్రయోగాత్మకంగా తీశారు. కౌబాయ్ అనేది మన సంస్కతి కాదు. అందుకే ఈ సినిమా ప్రారంభించినపుడు అనేక విమర్శలు వచ్చాయని అంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయని కృష్ణ విమర్శలను లెక్కచేయకుండా సినిమా తీశారు. తన సొంత నిర్మాణ సంస్థ పద్మా లయా స్టూడియోస్ పతాకంపై కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. అలాగే సినిమా కథపై ఉన్న నమ్మకంతో 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని రంగుల్లో తీశారు. నిర్మాణపరంగా రాజీ పడలేదని హీరో కృష్ణ, చెప్పారు. రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ చేశారు. కృష్ణతో పాటుగా విజయనిర్మల, నాగభూషణం, కైకాల సత్యనారా యణ, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు. అంతర్జాతీయ స్థాయిలో తీసిన సినిమా ఇది. తొలికాపీ వచ్చాక పరిశ్రమ ప్రముఖులు పెదవి విరిచారని కృష్ణ చెప్పేవారు. కౌబాయ్ తెలుగు కథ కాదని, ఆదరణ లభించదనే కామెంట్స్ వినిపించాయి. సినిమా విడుదల య్యాక కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. కౌబాయ్ ను తెలుగువారికి పరిచయం చేసింది. 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని ట్రజర్ హంట్ పేరుతో ఆంగ్లలో అనువదించడం విశేషం. అలాగే తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు. చిత్ర విజయంలో సాంకేతిక నిపుణులుగా దర్శకుడు కేయస్ఆర్. దాస్, మేకప్ మెన్ మాధవరావు,ఛాయాగ్రహకుడు విఎస్ఆర్.స్వామి,ఆదినారయణరావు సంగీతం కీలక పాత్ర వహించారు.