నేడు భారత త్రివర్ణ పతాక రూపకర్త పింగళ వెంకయ్య జయంతి

భారత జాతీయ పతాకానికి సెల్యూట్ చేసినప్పుడల్లా వీరు గుర్తుకు వస్తారు.నేడు ఆగస్టు 2 భారత త్రివర్ణ పతాక రూపకర్త పింగళ వెంకయ్య  జయంతి.

జాతీయ త్రివర్ణపతాక నిర్మాత, స్వాతంత్య్ర యోధుడు, *వ్యవసాయ శాస్త్రవేత్త,* సాహితీవేత్త, బహుభాషా నిష్టాతుడైన *ఆంధ్ర శిరోరత్నం పింగళ వెంకయ్య 1878వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన కృష్ణాజిల్లా దివిసీమలోని *భట్ల తెనుమర్రులో* హనుమంతురావు దంపతులకు జన్మించాడు. వెంకయ్య ప్రాధమిక విద్య పెద్ద కళ్లేపల్లిలో జరిగింది. 1890వ సంవత్సరంలో లోయర్‌ సెకండరీ విద్యలో ఉత్తీర్ణుడయ్యాడు. బందరులో హింధూ హైస్కూల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. విద్యా కాంక్ష వల్ల ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం వదలి శ్రీలంకకు వెళ్లి కొలంబోలోని సిటీ కళాశాలలో చేరి రాజకీయ ఆర్ధిక శాస్త్రాలలో ఉత్తీర్ణుడయ్యాడు. లాహోర్‌ వెళ్లి దయానంద ఆంగ్లోవేదిక్‌ కళాశాలలో సంస్కృతం, ఉర్ధూ, జపాన్‌ భాషలను సమర్ధంగా అభ్యసించాడు.
                                             
ఈ భాషల్లో ఏకధారగా, గంభీరంగా ఉపన్యాసాలు చేసేవాడు. తన 44వ సం వత్సరంలో డిప్లమాలు తీసుకున్నాడు. 1906లో మద్రాసులో కొంతకాలం రైల్వేగార్డుగా పనిచేశాడు. కె హనుమంతురావు ఆహ్వానంపై బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు.
           ....                           
అప్పుడే దుగ్గిరాల గోపాలకృష్ణతో పరిచయం ఏర్పడింది. తన 22వ ఏట కలకత్తాలో జరిగే జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు వెళ్లాడు. జాతీయ కాంగ్రెస్‌ విషయ నిర్ణయ సభకు ఎంపికయ్యారు. 1917లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.
                 ...                      
వెంకయ్య మన భారతీయులకు ప్రత్యేక పతాకం ఉండాలని దాని ని తాను రూపొందించాలని ఆలోచించారు. జాతీయ పతాకాన్ని రూపొందించే విషయమై బాలగంగాధర్‌ తిలక్‌, లాలా లజపతిరాయ్‌, మోతీలాల్‌నెహ్రూ, రవీంధ్రనాధ్‌ ఠాగూర్‌ మొదలైన మేధావులతో సంప్రదించాడు. *1916లో భారతదేశమునకు ఒక జాతీయ పతాకం అనే గ్రంధాన్ని రచించాడు.* అందులో 30 రకాల పతాకాలను రూపొందించారు.
                       ..               
అందులో ఒకటి చిన్న మార్పులతో నేటి మన జాతీయ పతాకమైంది. వెంకయ్య ఆధ్వర్యంలో ఒక జాతీయ సంఘం స్థాపించబడింది. 1921, మార్చి 31వ తేదీన బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ వెంకయ్యను ఒక జాతీయపతాకాన్ని చిత్రించి ఇవ్వవలసిందిగా కోరాడు. వెంటనే వెంకయ్య మూడు గంటలలో త్రివర్ణ పతాకాన్ని చిత్రించి ఇచ్చారు.
                                           
1922లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. చైతన్యానికి, స్వచ్ఛతకు, సౌభాగ్యానికి ప్రతీకలైన ఎరువు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ముద్దుల పతాకంగా చూడముచ్చటగా వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు. తర్వాత పతాకం మధ్యలో రాట్నానికి బదులు అశోక ధర్మచక్రాన్ని చేర్చి మన జాతీయ ప తాకంగా ఎన్నుకోవడం జరిగింది. గాంధీ మహాత్ముడు యంగ్‌ ఇండియా అనే పత్రికలో ఏకైక జాతీయ పతాకం కోసం మన సర్వస్వం త్యాగం చేయడానికి సంసిద్ధులై ఉండాలన్న విషయాన్ని మనం మరువకూడదు.
                                           
జాతీయ పతాక సమస్యను గురించి అత్యంత ఉత్సాహంతో దీక్షతో వెంకయ్య చేస్తున్న కృషిని నేను ఎప్పుడు కొనియాడుతుంటానని వెంకయ్యను ప్రసంసించాడు. పింగళ వెంకయ్య తన చివరి కోరికను గూర్చి చనిపోయే ముందు నేను మరణించిన పిమ్మట జాతీయపతాకాన్ని నా శరీరం మీద కప్పి శ్మశానానికి తీసుకువెళ్లాలి. శ్మశానానికి వెళ్లిన తరువాత కృష్ణానది తీరాన ఉన్న ఒక రావిచెట్టుకు ఆ పతాకాన్ని కట్టి ఎగురవేయాలి. నా శరీరం పూర్తిగా దగ్ధమయ్యే వరకు అది రెపరెపలాడుతూ ఎగురుతూ ఉండాలి అని తనకు చెప్పినట్లు *డాక్టర్‌ గూడారి నమశ్శివాయ జాతీయ పతాక నిర్మాత అనే వ్యాసంలో పేర్కొన్నాడు.

పింగళ కోరికను తీర్చినట్లు ఆయన వ్యాసంలో తెలిపాడు. దేశ భక్తుడు, రచయిత, విజ్ఞాన శాస్త్రవేత్త అయిన పింగళ వెంకయ్య 
*1963, జూలై 4వ తేదీన భారతమాతలో లీనమయ్యాడు.* ఆయన జాతీయ త్రివర్ణ పతాక రూపంలో భారతదేశ ప్రజలందరికీ సాక్షాత్కారిస్తూ చైతన్య స్ఫూర్తిని కలిగిస్తుంటాడు.
ఇటీవల జాతీయ పతాకం రూపొందించింది 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాచర్లలో నివాసముంటున్న పింగళి వెంకయ్య గారి కుమార్తె సీతామహాలక్ష్మి గారిని స్వయంగా కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు వారిని సత్కరించి వారికి మెమొంటో నగదు నజరానా ప్రకటించడం హర్షించదగ్గ విషయం.
పింగళి వెంకయ్య గారు వారసులు మన పల్నాడు ప్రాంతం లో నివసించడం కూడా మనందరికీ గర్వకారణం.
           జైహింద్.