విద్యార్థుల కోసం విభిన్న కార్యక్రమాలు చేసే ఘనత ఎఫ్. టీ.ఐ.హెచ్ కి దక్కుతుంది

విద్యార్థుల కోసం విభిన్న కార్యక్రమాలు చేసే ఘనత ఎఫ్. టీ.ఐ.హెచ్.దే..
_ కెనాన్ మెంటార్, సీనియర్  ఫోటో గ్రాఫర్, ధనిశెట్టి రాంబాబు.

ఆర్ట్ అండ్ టెక్నాలజీ సమపాళ్ళలో ఉంటేనే ప్రొఫెషన్ లో రాణించ గలరని కెనాన్ మెంటార్ ధనిశెట్టి రాంబాబు అన్నారు 

వరల్డ్ ఫోటోగ్రఫీ డే,ఆగస్ట్ 19 సందర్భంగా ఎఫ్. టీ.ఐ.హెచ్.వింటేజ్ కలెక్షన్ ఆఫ్ కెమెరాస్ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆయన విచ్చేశారు.

శ్రీ సూర్య ఫోటో స్టూడియో ,విజయవాడ అధినేత,కీ. శే. శ్రీ. యస్. సింహాచల రెడ్డి కలెక్ట్ చేసిన  డిఫరెంట్ స్టిల్ మరియు వీడియో కెమెరాలను ఎఫ్. టీ.ఐ.హెచ్. ఎగ్జిబిషన్ పెట్టగా
రాంబాబు ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.

ఈ కెమెరాలు అన్నీ 1915 నుండి 1997 వరకు ఉన్న  పురాతన కెమెరాలు కావడం విశేషం.

200 మందికి పైగా విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్ ను తిలకించారు. 

విద్యార్థుల కోసం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న ఎఫ్. టీ. ఐ.హెచ్.యం. డీ మరియు సీఈవో ఉదయ్ కిరణ్ కటకం ను రాంబాబు అభినందించారు.

ఈ సందర్భంగా
విద్యార్థులతో ముచ్చటించి తన అనుభవాన్ని వారితో పంచుకున్నారు.

సీనియర్ సినిమాటోగ్రాఫర్, సినీ దర్శకులు, ఎకడమిక్స్ డీన్. ఎం.వీ.రఘు ఈ కెమెరాల ప్రత్యేకత గురించి విద్యార్థులకు వివరించారు.

 ప్రతి సంవత్సరం ఆగస్ట్ 19న  వరల్డ్ ఫోటోగ్రఫీ డే గా ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటారని యం. వీ. రఘు తెలిపారు.

అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ ఫ్యాకల్టీ శ్రీకర్, సినిమాటోగ్రఫీ ఫ్యాకల్టీ అవినాష్ మరియు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.