అవయవదానం

అవయవదానం💕

మారుతున్న కాలంలో
మర్మంగా దాగిన సత్యంలో
మంచితనం మహోపకారమై!...

నవ్వుతున్న గుండే
మరో మనిషికి లయలై
హృదయ సంగీతమై రాగాలే తీయదా!....

తరిగిపోయె జీవితాన వెలుగులే నింపదా
పరుగుల కాలాన్ని ఆపమంటుా
మరింత బంధాలను కలపమంటుా!...

కన్నులను ముాయకురా లేనివాడి
చుాపువై మేలుకొలుపు నీవుకావా!

శరీర భాగాలన్ని దేవాలయమేగా
మరొకరి బాగుకై బ్రతికేస్తుా!

లేనివారు కనుమరుగైనా 
దానరుాపమై మన కన్నుల గాంచమా
ప్రేమను పంచమా
పచ్చపచ్చని కాంతులతో
వెచ్చవెచ్చని చెలిమి చేస్తుా!

బ్రతికించవా మరెందరికో జీవం పొస్తుా
మహామనసు నీదంటుా
మరెందరో కుటుంబాల కంటనీరు తుడుస్తుా
అలసిన మనసులకు ఊరటనిస్తుా....

పుణ్యమంతా నీదిగా
అవయవదానమెంతో గొప్పగా!
చేయుాతనిద్దాం!
వెలుగులో ఓ చిరుదివ్యగా ఆలంబనై!...

                         అరుణ సందడి✍