ఫోటోగ్రఫీలో లైటింగ్ ప్రక్రియ ఆధునిక పుంతలు తొక్కుతోంది

ఫోటోగ్రఫీలో లైటింగ్ ప్రక్రియ కొత్త పుంతలు తొక్కుతుంది 
  -సచిన్ భరద్వాజ్ 


టాలెంట్ ఎక్స్ ప్రెస్:
ఎఫ్.టి.ఐ.హెచ్. మీడియా కాలేజీ వేదికగా జరిగిన మ్యాజికల్ లైటింగ్ విత్ గోడాక్స్ వర్క్ షాప్ పలువురిని ఆకర్షించింది. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గోడాక్స్ మెంటర్ సచిన్ భరద్వాజ్ ఎఫ్.టి.ఐ.హెచ్ విద్యార్థులకు గోడాక్స్ లైట్స్ యొక్క విశిష్టతను తెలిపారు. ఎలాంటి ఫోటోస్ కావాలంటే ఎలాంటి లైటింగ్ ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకుంటే అవుట్ పుట్స్ వస్తాయి అనే అంశాలను ప్రాక్టికల్ గా చేసి చూపించారు. మనం తీసే ఫోటోస్ ఎలా ఉండాలో ముందుగానే ఊహిస్తే మనం అనుకున్నది అనుకున్నట్టు రిజల్ట్స్ ఉంటాయని సచిన్ తెలిపారు. ఎఫ్.టి.ఐ.హెచ్ తో తన అనుబంధం గురించి వివరిస్తూ ఎఫ్.టి.ఐ.హెచ్  తన విద్యార్థుల కోసం ఎన్నో రకాల కొత్త ఆలోచనలు చేసి, వాటిని ఆచరణలో పెట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుందన్నారు. ఖర్చుకి వెనకాడకుండా విద్యార్థులకు మెరుగైన విద్య, సరైన ప్రాక్టికల్ సెషన్స్ ఏర్పాటుచేయడం ఒక్క ఎఫ్.టి.ఐ.హెచ్ కి మాత్రమే సాధ్యమైందన్నారు. 70 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం భవిష్యత్ ఫోటోగ్రాఫర్లకు, సినీమాటోగ్రాఫర్లకు ఎంతో ఉపయోగపడుతుందని ఎఫ్.టి.ఐ.హెచ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ఉదయ్ కిరణ్ కటకం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.టి.ఐ.హెచ్ డీన్ అఫ్ అకాడమిక్స్ ఎం.వి.రఘు, బ్రాంచ్ మేనేజర్ అండ్ సినిమాటోగ్రఫీ ఫాకల్టీ అవినాష్.కే, ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ ఫాకల్టీ సాయి శ్రీకర్,
కల్చరల్ సెక్రటరీ , పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫాకల్టీ హర్షవర్ధన్ రెడ్డి  మరియు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు