ఫొటో..

ఫోటో..

సుందరలోకాన్ని కన్నులకింపుగా చేస్తుా,
కదులుతున్న కాలంలొ
కధలన్ని చుాపిస్తుా,
కదులుతున్నది 
ఓ సుందర రుాపం......

అందాలని బంధాలని బందిస్తుా
సంతోషాలను దుఃఖాలను చుాపేస్తుా
పుట్టుక చావుల చిత్రాలతో మనసు కరిగించేస్తుా
ప్రకృతి ప్రళయాలను కన్నుల ముందు ఉంచేస్తుా.....

రాతలను గాధలను బద్రం చేస్తుా
అల్లరిని అనుభుాతులని అద్దం పట్టేస్తుా
వాస్తవాలను గతాలను చక చక తిపేస్తుా
నిజాలను అబద్ధాలను నిజాయితిగా నిరుాపిస్తుా.....

శోధనలను పరిశోధనల యందు ముందుకు అడుగేస్తుా
చరిత్రను వాస్తవ ప్రపంచానికి అందిస్తుా
వడలిపోక సోలిపోక నిత్య కాంతితో పయనిస్తుా....

ఎన్నెన్నో రుాపాలను కన్నుల ముందు నిలిపే సాక్షమై
రేపటి తరాలకు పాఠమై
మరోచరిత్రకు ముాలమై
నిత్యజీవనంలో సత్యశోదనై
నిలిచేదే ఈ హీరో  మన హీరో
           "కెమెరా"

          అరుణ సందడి✍

 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు ..