టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇన్స్టిట్యూట్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది..

టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇన్స్టిట్యూట్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది: సీనియర్ సినీ సౌండ్ ఇంజినీర్ రాజశేఖర్

టెక్నాలజీ పెరుగుతున్న ఈరోజుల్లో టెక్నికల్ కోర్సులు నేర్చుకోవడం వల్ల అవకాశాలు అందుకోవడం తేలిక అవుతుంది అని ప్రముఖ సినీ సౌండ్ ఇంజనీర్ రాజశేఖర్ తెలిపారు.
సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన యఫ్. టి. ఐ. హెచ్. ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ) స్టూడెంట్స్ కోసం నిర్వహించిన స్పెషల్ వర్క్ షాప్ లో రాజశేఖర్ అతిథిగా పాల్గొన్నారు. 
"సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత ఏంటి ?" అనే అంశంపై జరిగిన ఈ వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. 
 ఒకప్పుడు సినీరంగంలో అవకాశాలు దక్కడం చాలా కష్టంగా ఉండేదని, ఇప్పుడు ఓటీటీలు, యూ ట్యూబ్ లు కూడా వచ్చాక అవకాశాలు పెరుగుతున్నాయని, చక్కగా శిక్షణ తీసుకుంటే అవకాశాలు మనను వెతుక్కుంటూ వస్తాయని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు. 
5.1 మరియు 7.1 కు ఉన్న ప్రాధాన్యత, వ్యత్యాసం, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రాముఖ్యత గురించి ఎన్నో విషయాలను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా ఎఫ్. టి. ఐ.హెచ్. యాక్టింగ్ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు తెలిపారు.   
ఈ ఇన్స్టిట్యూట్ లో యం వీ రఘు లాంటి ప్రముఖులు ఉండడం వలన విద్యార్థులు ఇంకా ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
డైరెక్షన్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న కొందరు విద్యార్థులకు రాజశేఖర్ సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో యఫ్. టి. ఐ. హెచ్. మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ ఉదయ్ కిరణ్ కటకం, యఫ్. టి. ఐ. హెచ్. డీన్ యం. వి. రఘు, సౌండ్ ఫ్యాకల్టీ సాల్మన్,  యాక్టింగ్ ప్రొఫెసర్& పీఆర్వో. డా.శ్రీజ సాదినేని, మరియు ఎఫ్. టి. ఐ.హెచ్. అధ్యాపక బృందం పాల్గొన్నారు.