బుల్లెట్ బండి @ తెనాలి మస్తాన్ బ్యాండ్

బుల్లెట్ బండి @ తెనాలి మస్తాన్ బ్యాండ్
- జానపద సంగీతంలో అద్భుతాలు సృష్టిస్తున్న మాస్టర్ బాజి
టాలెంట్ ఎక్స్ ప్రెస్:

అవును మీరు విన్నది నిజమే. ఇటీవల వైరల్ గా మారిన బుల్లెట్ బండి పాటకు మ్యూజిక్ అందించింది మన తెనాలి కి చెందిన బాజి. ఈ పాట రచన, గానం అద్భుతం. అంతకుమించి ఆ పాటకు బాణీ కట్టిన సంగీత దర్శకుడు ప్రతిభ, సృజనాత్మక ఇంకా అద్భుతం. జానపద సంగీతంలో ఈ పాటకు వచ్చిన స్పందన ఒక రికార్డ్. లోతుల్లోకి వెళితే ఈ పాట సంగీత దర్శకుడు షేక్ బాజి తొలుత మస్తాన్ బ్యాండ్ లొనే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. 
మస్తాన్ బ్యాండ్ అంటే దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ బ్యాండ్. తరతరాల గా వారసత్వం గా సంగీతమే నమ్ముకుని నేటికి ఈ సంస్థ కొనసాగుటూవుంది. బాజి తాత మస్తాన్, తండ్రి మీరావలి, మేనమామ పెద బాజీల నుంచి అందిపుచ్చుకున్న సంగీత పరిజ్ఞానానికి మెరుగులు అద్ది నేడు సినీ రంగం లోను రాణిస్తున్నారు మాస్టర్ జూనియర్ బాజి. అనేక హిట్ ప్రవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లకు, పలు సినిమాలకు సంగీతం అందించారు బాజి. వృత్తిరీత్యా హైదరాబాద్ లో సొంత రికార్డింగ్ స్టూడియో నెలకొలపారు. జన్మస్థలంపై ఎంతో అభిమానం చూపించే బాజి ఇటీవల తెనాలి స్వతంత్ర్య ఉద్యమం పై దర్శకుడు కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో, గల్లా జ్ఞాన శేఖర్ నిర్మాణ సారథ్యంలో, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు కధ అందించిన వీరస్థలి తెనాలి మినీ మూవీ లోని ఒక పాటకు సంగీతం అందించారు బాజి. ఈ పాటను తెనాలి చెందిన చిత్రకళా ఉపాధ్యాయుడు బెల్లం కొండ వెంకట్, భవ్యలు గానం చేశారు. మా అందరి ఊపిరే వీడు, మన ఊరి రాముడే చూడు అనిసాగే ఈ పాటను రత్నాకర్ రచించారు. తనదంటూ  ప్రత్యేకమైన కొత్త బాణీ లను అందిస్తూ, సరికొత్త సంగీతం అందిస్తూ సంగీత ప్రపంచం లో రాణిస్తున్న బాజి మరిన్ని ఉన్నత స్థానాలు అందుకోవాలని ఆశిస్తున్నాము. ఈ సందర్భం గా వీరస్థలి చిత్ర యూనిట్ మాస్టర్ బాజి కి అభినందనలు తెలిపారు.