ఈ-నారి" కార్యక్రమాన్ని ప్రారంభించిన -హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ.

*"ఈ-నారి" కార్యక్రమాన్ని ప్రారంభించిన  హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ.* 

-ఏపీ లో అన్ని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీ విద్యార్థినులకు ఆన్లైన్ భద్రతకు సంబందించిన అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర మహిళా కమిషన్, సైబర్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలరోజులపాటు జరిగే "ఈ-నారి" కార్యక్రమాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ గురువారం ప్రారంభించారు.

-మంగళగిరి లోని మహిళా కమిషన్ కార్యాలయం లో "ఈ-నారి" మాసొత్సవం కార్యక్రమాన్ని హోంమంత్రి పోస్టర్ ను ఆవిష్కరించి ప్రారంభించారు. 

-ఈ సందర్బంగా హోంమంత్రి మాట్లాడుతూ మహిళా భద్రత కు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను మరింత పటిష్టంగా తీసుకెళ్లాలని దిశ యాప్ ను అందరు ఉపయోగించుకోవాల ని కోరారు.

-వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలను స్కూల్ స్థాయి వరకు తీసుకువెళతామని ప్రతి యూనివర్సిటీ నుండి 10 వేల మంది విద్యార్థినులు ఈ సెమినార్లు, వెబినార్లు లో పాల్గొంటారని తెలిపారు.

-రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మహిళా మేధావులు, ప్రముఖలతో మహిళా కమిషన్ చర్చా గోష్టిలు కూడా నిర్వహిస్తుందని పద్మ తెలిపారు.

-"మహిళా సాధికారత-పథకాలు -ఫలితాలు " అనే అంశం పై ఈ చర్చా గోష్టి జరుగుతుందని పేర్కొన్నారు.

-నాగార్జున యూనివర్సిటీ నుండి ప్రారంభమయ్యే "ఈ-నారి" ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డా.సరస్వతి, డా.సునీత, డా.సంధ్య మహిళా కమిషన్ సభ్యులు కె. జయలక్ష్మి, గజ్జెల లక్ష్మి, డైరక్టర్ ఆర్. సూయజ్, సెక్రటరీ కె. నిర్మల తదితరులు పాల్గొన్నారు.