ఘనంగా డి సి ఎస్ ఎం ఎస్ మాజీ చైర్మన్, వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తెర హెనీ క్రిస్టినా జన్మదిన వేడుకలు


టాలెంట్ ఎక్స్ ప్రెస్:
హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ సతీమణి డి సి ఎస్ ఎం ఎస్ మాజీ చైర్మన్ వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తెర హెనీ క్రిస్టినా జన్మదిన వేడుకలు శనివారం తెనాలి పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నదానం, వస్త్ర దానంం, బెడ్షీట్లు, పండ్లు, రొట్టెలు, పంపిణీ చేశారు. ముందుగా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివ లింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి లో పెద్ద ఎత్తున పేదలకు ,అనాథలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ శాంతి సేవ ఆశ్రమం లో వృద్ధులకు చీరలు పంచెలు, పండ్లు ,రొట్టెలు, పంపిణీ చేశారు. అనంతరం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో తల్లి పిల్లల వార్డులో బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు బెడ్షీట్లు ,పండ్లు, రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ మార్ మాట్లాడుతూ పేదల మధ్య అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న శివ లింగేశ్వర స్వామి సేవా సమితిని ఆయన అభినందించారు. అదేవిధంగా నిరాధరణకు గురై వృద్ధాశ్రమం లో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు తమవంతుగా దుస్తులు పంపిణీ చేయటం సంతోషాన్ని కలిగించిందన్నారు. తల్లి పిల్లల వార్డులో బాలింతలు గర్భిణీలకు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు పండ్లు, రొట్టెలు అందజేసి వారి మధ్యన క్రిస్టినా జన్మదిన జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు .సంపద కలిగిన వారు పేద వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. వై ఎస్ ఆర్ సి పి ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి తన పుట్టినరోజు వేడుకలను అనాధలు పేదలు, వృద్ధులు, బాధితులు మధ్య జరుపుకుంటున్నామని తెలిపారు. తమకు ఉన్న దాంట్లో వారికి సహకరించటం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. వృద్ధాశ్రమంలో వృద్ధులను చక్కగా చూసుకోవటం కనిపించిందని మహాత్మా గాంధీ ఆశ్రమంలో వృద్ధులు అందరూ ఆనందంగా ఉండడం సంతోషాన్ని కలిగించిందన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు క్రిస్టినా తెలిపారు. పదిమందికి సేవ చేయటమే తన లక్ష్యంగా తెలిపారు. తొలుత హార్వెస్ట్ ఇండియా అభిమానులు కత్తెర దంపతులను పూల మాలలు, బొకే లతో సత్కరించి కేక్ లను కట్చేసి అభినందనలు తెలిపారు .ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడుశుద్ధపల్లి నాగరాజు, కుర్ర శీను, కుర్ర లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ కుర్ర సుజాత, మాజీ సర్పంచ్ ఉన్న షకీలా, మాజీ ఎంపిటిసి పినపాటి సురేష్ బాబు, దళిత నాయకుడు కూచిపూడి మోహన్, హార్వెస్ట్ ఇండియా మేనేజర్ గిద్యోను, కార్యదర్శి ఈశ్వర్, శౌరి, నాతాను, కోట్లాది దీీలీప్, వెంకట్రావు, బాబు పలువురు అభిమానులు పాల్గొన్నారు.