మాతృభాష

మాతృభాష 

అమ్మ భాష మధురం
తెలుగు  వెలుగు దివ్యం
అక్షరాలు సుస్వరాల రాగం
జాలువారు ముత్యాల హారం
శ్రీకృష్ణదేవరాయల కలం
పలుకులమయం
ఆముక్త మాల్యదా తెలుగు కావ్యధనం

ద్రావీడభాషలో పుట్టి పెరిగింది
సుకుమార తెలుగు వాణియై పలికింది
కవతా ప్రవాహమై కొత్త అందాలు అద్దింది
పదాల గారడి ఏదో చేసింది..॥

నన్నయ్య తిక్కన ఎఱ్ఱన  పాండిత్యమై నవ్వింది,
మనుచరిత్రలో మనసుకింపై చుాసింది
తెలుగు తేట నుడికార సొంపులకు ఒంపులకు వయ్యారమైంది
అల్లసాని అల్లిక జిగిబిగిలో పల్లవింపైనది

రామదాసు కీర్తనలై వెల్లువెత్తగా
తాళ్లపాక అన్నమయ్య గేయాల అభిషేకాలే చేయగా
త్యాగరాజు కృతులై మది జోల పాడగా
క్షేత్రయ్య  మువ్వ గోపాలునిగా నాట్యమాడగా
నండుారి ఎంకి పాటై పాడగా
గిడుగు రామముార్తి ఉద్యమాల బాటలో వెలుగై నిలవగా....

రాజులు కట్టిరే నాడు సాహిత్యానికి కోట
బీటలు వారుతున్నది తెలుగోడి నోట
అమ్మ భాష జన్మభూమి రుణం
బ్రతికింపదలచరెందుకో నేటి జనం

"భాషలందు తెలుగు లెస్స" పదం ఓ అద్బుతం
దుారమగుతున్నది తెలుగు దురదృష్టం 
ఆంగ్లభాష పదాల వ్యామెాహం
అర్ధం లేని ప్రయాస గమనం...

కదులుతున్నవి కవుల కవనం
కళ్లు తెరిపించాలనే విశ్వప్రయత్నం
నాటికి నేటికి తరగదు తెలుగు కమ్మదనం
అది కడుపునింపే అమ్మతనం...

కావాలి బాలలకు తెలుగు భాషా పరిజ్ఞానం 
పెరగాలి మాతృభాషపై మమకారం
గ్రంధాలెన్నో కుార్చాలి
తెలుగు భోధనా చైతన్యమే పెంచాలి
ఖ్యాతినొందాలి దిగంతాల పయనం
జయం జయం తెలుగుతల్లికి జయం
సుందరం సుమధురం తెలుగు భాష తీయదనం ........

         సందడి అరుణ కుమారి✍