Skip to main content

మాతృభాషలో పట్టు ఉంటేనే పరభాషా నైపుణ్యం

మాతృభాషలో పట్టు ఉంటేనే పరభాషా నైపుణ్యం 
- ఎమ్మెల్యే అన్నాబత్తుని  శివకుమార్ 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ : మాతృభాషలో పట్టు ఉన్న వారికే పరభాషల్లో నైపు ణ్యం దక్కుతుందని, తెలుగు భాషపై అనర్గళ మైన పట్టు ఉండబట్టే మాజీ ప్రధాని పీ.వీ నరసింహారావు బహుబాషా కోవిదులుగా సార్థకత చేసుకున్నారని ఎమ్మెల్యే శివ కుమార్ అన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆదివారం బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్, అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో తెలుగు బాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కవిసమ్మేళనం, తెలుగు గీతాలతో తెలుగు తల్లికి నీరాజనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు వైష్ణవి కళాశాల ప్రిన్సిపాల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ఆయన తెలుగు భాష గొప్పతనాన్ని, మాతృ భాష మాధుర్యాన్ని వివరించారు. జీవన పరిస్థితుల నేపధ్యంలో ఇతర భాషలు నేర్చుకోవాల్సి వచ్చినా మాతృభాషను విస్మరించ రాదన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గెలుపునకు తెలు గు భాషపై ఆయనకున్న పట్టే కారణమన్న సీజేఐ ఎన్వీ రమణ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మారుతున్న ప్రపం చంలో ఆంగ్లభాష అవసరం ఉన్నా మాతృభాషను వదలిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. గ్రాంధిక భాషను వాడుక భాషగా మార్చి అందరికి పుస్తక పఠనం అలవాటు చేసిన గొప్ప భాషాభిమాని గిడుగు రామ్మూర్తి అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాక్టర్ వెన్నా వల్లభరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు భాషను బతికించలేవని, ప్రజలే భాషకు జీవం పోయాలన్నారు. సాహితీ విశ్లేషకులు అంబటి మురళీ కృష్ణ డాక్టర్ గుమ్మా సాంబశివరావు, బెజవాడ ఆంధ్ర ఆర్ట్స్ అకాడమి అధ్య క్షుడు గోళ్ల నారాయణరావు, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావి పాటి వీరనారాయణ, డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్, బొల్లి ముంత కృష్ణ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో కరోనా కాలంలోనూ తెలుగు భాషకు వెలుగులద్దిన కవులు, గాయకు లు అయినాల మల్లేశ్వరరావు, ఆరాధ్యుల ఆదినారాయణ, హకీం జానీ, ఆళ్ల నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. పలు వురు కవులు తమ కవితలతో తెలుగు తల్లికి కవితా నైవేద్యం చేయగా, బెల్లం కొండ వెంకట్, రత్నకుమారి తెలుగు గీతాలా పనతో నీరాజనం చేశారు. శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మాష్టర్ వెంకట్ ఆధ్వర్యంలో రూపొందించిన తెలుగు గీతావళి సీడీని ఆవిష్కరించారు. సీహెచ్. సుబ్బారావు, కనపర్తి బెహర్, గోగినేని కేశవరావు, ఆస్మతున్నీసా తదితరులుపర్యవేక్షించారు. 

.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...