ఇవాళ కొంటె బొమ్మల బ్రహ్మ.. బాపు వర్ధంతి

🚩🚩 ఇవాళ కొంటె బొమ్మల బ్రహ్మ.. బాపు వర్ధంతి!🌹
.
♦నారాచీరతో వనవాసంలో ఉన్న సీతమ్మను చూపించాలన్నా…. వాలుజడతో వయ్యారాలు పోయే పడుచుల అందాలను చూపించాలన్నా….. 
♦పెళ్లిలో సిగ్గుతో తలదించుకున్న పెళ్లికూతురును వర్ణించాలన్నా అది బాపుకే సాధ్యం. 
♦ఒక్కముక్కలో చెప్పాలంటే అందమైన అమ్మాయిని వర్ణించాలంటే…..పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదు. 
సింపుల్ గా బాపు బొమ్మ అంటే చాలు.
అచ్చ తెలుగుదనానికి ప్రతీక …బాపు బొమ్మలు
.ఇవాళ బాపు వర్ధంతి.
-
♦బాపు పూర్తిపేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. 1933 డిసెంబర్ 15 న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ లో జన్మించారు.
1955లో మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి లాయర్ పట్టా పుచ్చుకున్నారు.
-
♦ఆంధ్రపత్రికలో కార్టూనిస్ట్ గా చేరారు.
వాలుజడతో సన్నని నడుముతో.. హొయలుపోతూ మల్లెపూల దండ తయారుచేస్తున్నట్లుగా ఉండే బాపు బొమ్మ ఎవర్ గ్రీన్.
1967లో చిత్ర దర్శకుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బాపు.
-
♦సాక్షి…..ఆయన తొలి సినిమా.
చివరి చిత్రం…శ్రీరామరాజ్యం.
మొత్తం 51 సినిమాలకు ఆయన దర్శకత్వం
దర్శకుడిగా బాపుది విలక్షణ శైలి. రామాయణాన్ని ఆధారం చేసుకుని సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్
దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం….జాతీయ అవార్డులు సాధించాయి.
అయిదు సార్లు నంది అవార్డులను సొంతం చేసుకున్న బాపు
ఆయనకు నంది అవార్డులతోపాటు ఎన్నో రాష్ట్ర,జాతీయ పురస్కారాలు లభించాయి.
♦1986లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 1991లో కళాప్రపూర్ణ పురస్కారం,పొట్టిశ్రీరాములు పురస్కారం, పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి.
స్నేహితుడు, రచయిత ముళ్లపూడి రమణతో కలిసి లెక్కకుమించి సినిమాలు తీశారు బాపు.
బాపుకు ముళ్లపూడి వెంకట రమణ ఆప్త మిత్రుడు.
ముళ్లపూడితో కలిసి బాపు రూపొందించిన బుడుగు పుస్తకం తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్.
♦1972లో తీసిన సంపూర్ణ రామాయణం జనాన్ని భక్తిపారవశ్యంలో ముంచేసింది.
తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాధ్యాయం ముత్యాలముగ్గు.
1975లో బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమా.. తెలుగు సినిమా రంగానికే ఓ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.
- సేకరణ