సుకుమార్ నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభం

సుకుమార్ నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభం

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్  తన సొంత గ్రామమైన మట్టపర్రులో  తండ్రి కీ.శే. బండ్రెడ్డి తిరుపతినాయుడు పేరు మీద పాఠశాల భవనం నిర్మించారు. ఈ భవనం ఆగస్ట్ 1, ఆదివారం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమంలో  సుకుమార్‌తో పాటు, ఆయన సతీమణి తబిత, ప్రముఖ రాజకీయ నాయకులు, సన్నిహితులు,స్నేహితులు పాల్గొన్నారు. కాగా, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరత లేకుండా గ్రామంలో రూ. 40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించిన సుకుమార్, ఇప్పుడు ఈ పాఠశాల భవనం నిర్మించడంతో గ్రామ ప్రజలంతా సుకుమార్ కు  కృతజ్ఞతలు తెలిపారు.