ఒలింపిక్ అథ్లెటిక్స్ విభాగంలో భారత్ కు తొలిసారి పసిడి పతకం సాధించిన నీరజ్ చోప్ర

ఒలింపిక్ అథ్లెటిక్స్ విభాగంలో భారత్ కు తొలిసారి పసిడి పతకం సాధించిన నీరజ్ చోప్డా...
ఒలింపిక్ అథ్లెటిక్స్ విభాగంలో తొలిసారి బంగారు పతకాన్ని సాధించి భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేసాడు జావలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్డా.టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్ జావలిన్ త్రో ఫైనల్స్ లో 87.58 మీటర్ల దూరం విసరి స్వర్ణాన్ని సాధించాడు. 1900 వ సంవత్సరం నుండీ జరిగిన అన్ని ఒలింపిక్ గేమ్స్ లో భారత్ కు అథ్లెటిక్స్ లో పసిడి పతకం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.