టాలెంట్ ఎంత ఉన్నా శిక్షణ తీసుకుంటేనే సినీరంగంలో రాణించగలం

టాలెంట్ ఎంత ఉన్నా శిక్షణ తీసుకుంటేనే సినీరంగంలో రాణించగలం
 - ప్రముఖ సినీ నటులు,దర్శకులు ఆదిత్య ఓం.
టాలెంట్ ఎక్స్ ప్రెస్:
సినీ రంగంలో రాణించాలంటే కఠోర సాధన, నటనలో శిక్షణ చాలా ముఖ్యమని, అందుకోసం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకోవడం ఎంతో అవసరమని సినీ నటులు, దర్శకులు తెలిపారు.
సౌత్ ఇండియా లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ గా పేరుగాంచిన యఫ్. టి. ఐ. హెచ్. ( ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ ) యాక్టింగ్ స్టూడెంట్స్ సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆదిత్య ఓం ముఖ్య అతిథిగా విచ్చేశారు. 
"తెలుగు,తమిళ,హిందీ, ఇంగ్లీష్ భాషలలో కలిపి దాదాపు 30కి పైగా చిత్రాలలో నటించడమే కాకుండా రచన, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టిన తాను కూడా ఒకప్పుడు యాక్టింగ్ స్టూడెంట్ నే అని, ఆ తర్వాత యాక్టింగ్ టీచర్ గా కూడా క్లాసెస్ చెప్పానని ఆదిత్య ఓం తెలిపారు.

విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

పెద్ద పెద్ద దర్శకులతో కలిసి పనిచేయడం తన అదృష్టమని, ఇప్పుడు కూడా దర్శకులు నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ నటనను రాబట్టుకుంటున్నారు అని, భయాలు, అనుమానాలు వదిలి సినీరంగంలో ప్రయత్నాలు కొనసాగించాలని విద్యార్థులను ఆదిత్య ఓం ప్రోత్సహించారు. 
ఈ సందర్భంగా ఎఫ్. టి. ఐ.హెచ్. యాక్టింగ్ విద్యార్థులు   ఇచ్చిన ప్రదర్శనలను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వారిని అభినందించారు.
యాక్టింగ్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న 100 మందికి పైగా  విద్యార్థులకు ఆదిత్య ఓం సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో యఫ్. టి. ఐ. హెచ్. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఉదయ్ కిరణ్ కటకం,
జురియల్ స్టూడియోస్ సీఈఓ శ్వేత కటకం, యఫ్. టి. ఐ. హెచ్. డీన్ యం. వి. రఘు,  యాక్టింగ్ ప్రొఫెసర్ అండ్ పీఆర్వో. డా.శ్రీజ సాదినేని, మరియు ఎఫ్. టి. ఐ.హెచ్. అధ్యాపక బృందం పాల్గొన్నారు.