సృష్టి ఆర్ట్ అకాడమీ కి సూరో భారతి సంగీత కళా కేంద్రం గుర్తింపు

సృష్టి ఆర్ట్ అకాడమీ కి సూరో భారతి సంగీత కళా కేంద్రం గుర్తింపు

టాలెంట్ ఎక్స్ ప్రెస్:
 ఒంగోలుకి చెందిన సృష్టి ఆర్ట్ అకాడమీ గత 19సంవత్స రాలుగా ఎంతోమంది చిత్రకారులను తయారు చేసి, పెయింటింగ్ లో ప్రపంచ రికార్డులను సాధించింది. కళారంగం లో చేస్తున్న సేవలకు గాను వెస్ట్ బెంగాల్, హుబ్లీ కి చెందిన సూరో భారతి సంగీత కళాకేంద్రం సృష్టి అకాడమీ నిర్వాహకులను గుర్తించి వారిని అభినందించింది. ఆకాడమికి ఆఫ్ఫ్లియేషన్ సర్టిఫికెట్,సంగీత కళా కేంద్రం అనుబంధ ప్రశంసా పత్రాన్ని అందజేసింది.  సంగీత కళా కేంద్రం అందించిన సర్టిఫికేట్ లను శుక్రవారం రాష్ట్ర దృశ్య కళల అకాడమీ చైర్మన్ గుడిపూడి సత్య శైలజ భరత్  చేతుల మీదుగా అకాడమీ నిర్వాహకులు తిమ్మిరి రవీంద్ర కు ఆమె పత్రాలను అందచేసి అభినందించారు. చిత్రకారులనప్రోత్సహిస్తామన్నారు. ఆర్ట్ అకాడమీ  నిర్వాహకులు షిల్డ్ ను  ఆమెకు అందచేశారు. సందర్భముగా తిమ్మిరి రవీంద్ర ను చిత్రకారుడు వై. యస్. బ్రహ్మం, నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి టి. భానుచందర్, సింగమనేని సురేష్, తునుగుంట నాగమణి, బత్తుల మంజు వాణి, చెరువు శ్రీలక్ష్మి, డైమండ్ 9 మేనేజింగ్ పార్టనర్ డి. బి. కోటేశ్వరరావు, టి. శిరీష, అద్దంకి అంజలీ, తునుగుంట హేమంత్ లతో పాటు చిత్రకారులు, సాహితి సంస్థల నిర్వాహకులు అభినందించారు.