సినీ తారల అందానికి మేకప్ తప్పనిసరి - సినీ మేకప్ మెన్ మురళి

సినీ తారల అందానికి మేకప్ తప్పనిసరి  
   - సినీ మేకప్ మెన్ మురళి 

ఎంత అందమైన వారికైనా కెమెరా ముందుకు వెళ్ళేటప్పుడు మేకప్ తప్పనిసరిగా చేయడం వల్ల అదనపు అందం, ఆకర్షణ వస్తుందని, అయితే వారి స్కిన్ టోన్ కి సరిపడే మేకప్ వాడాలని, అప్పుడే లైటింగ్ మరియు కెమెరా పనితీరుతో వారిని తెరపై అత్యద్భుతంగా చూపించగలమని సినీ మేకప్ మెన్ మురళి తెలిపారు.
ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైదరాబాద్ తమ విద్యార్థులకు అన్ని విభాగాల మీద అవగాహన పెంచేందుకు  ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తోంది . ఇందులో భాగంగా విద్యార్థుల కోసం స్పెషల్ మేకప్ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సినీ,టీవీ మేకప్ మెన్ పి.మురళి అతిథిగా పాల్గొన్నారు. నలభై సంవత్సరాల తన సినీ మేకప్ అనుభవం లో తాను నేర్చుకున్న ఎన్నో విషయాలను, మెళకువ లను ఎఫ్.టి.ఐ.హెచ్.  విద్యార్థులకు మురళి భోదించారు. 
సినిమాకి వాడే మేకప్ మీద కూడా  అవగాహన ఉండాలని ఆయన విద్యార్థులకు తెలియజేసారు.
అన్ని  రకాల మేకప్ లు, హెయిర్ స్టైల్స్ గురించి విద్యార్థులకు వివరిస్తూ, ఆ మేకప్ లను వేసి, హెయిర్ స్టైల్స్ ను చూపించి, విభిన్నమైన గెటప్, విగ్స్  విద్యార్థులకు అలంకరించి , వినూత్నమైన అనుభూతిని విద్యార్థులకు కలిగించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్. టీ.ఐ.హెచ్. సీఈఓ ఉదయ్ కిరణ్ కటకం, అకడమిక్ డీన్ యంవీ రఘు, ఫిల్మ్ మేకింగ్ ఫ్యాకల్టీ మయాని తరుణ్, యాక్టింగ్ ప్రొఫెసర్ అండ్ పీ ఆర్వో. డా.శ్రీజ సాదినేని  మరియు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.