రసవత్తరంగా సాగిన చాకలి ఐలమ్మ నాటక ప్రదర్శన టాలెంట్ ఎక్స్ ప్రెస్: సౌత్ జోన్ కల్చర్ సెంటర్ తంజావూర్ ,మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌజన్యం తో నవకళా భారతి షాద్ నగర్ వారి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్ లో ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాద్ లో ప్రదర్శించిన చాకలి ఐలమ్మ చారిత్రాత్మక నాటకం రసవత్తరంగా సాగింది. ప్రేక్షకులకు ఆకట్టుకుంది. కార్యక్రమం కో ఆర్డినేటర్ టీ.వీ.రంగయ్య మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధురాలు ఆనాటి దేశ్ ముఖ్ లు దొరల దౌర్జన్యాలను ,దురాగతాలను , దోపిడీలను ధైర్యంగా ఎదుర్కొని దొరల గుండెల్లో ఫిరంగి మోతలు మోగించి ధైర్యంగా పోరాడి దొరల గడీలను బద్దలు కొట్టి ప్రజకు.స్వేచ్చ ను ప్రసాదించిన వీరవనిత ఐలమ్మ అని అన్నారు. అలాంటివారు మనకు సదా స్మరణీయులు ముందు తరాలకు వారి త్యాగాలు ఆదర్శనీయం, స్ఫూర్తివంతం అని అన్నారు. స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా ఇలాంటి త్యాగమూర్తి ల గాథలను నాటక రూపం లో ప్రదర్శించి ముందు తరాలకు స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ సహకారంతో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నామన్నారు. నటీనట...