జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి 

తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ల రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు టి. రవీంద్ర బాబు మాట్లాడుతూ ఎంతో కాలంగా పరిష్కారం నోచుకోని జర్నలిస్టుల అక్రిడిటేషన్లను ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ మంజూరు చేయాలన్నారు. అదేవిదంగా ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులను జర్నలిస్టులకు అందజేయాలన్నారు. ఇళ్ల స్థలాలపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఫెడరేషన్ కార్యదర్శి కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ భారతదేశంలో జర్నలిస్టు వృత్తి, జర్నలిస్టులు ఎదుక్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని జర్నలిజాన్ని కాపాడండి, జర్నలిస్టులను రక్షించండి అనే నినాదంతో నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్టు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉద్యమ వారం నిర్వహిస్తుందని అందులో బాగంగా ఎన్.జె.యూ అనుబంద సంస్థల ఆధ్వర్యంలో తెనాలి డివిజన్ లోనూ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. తాత్కాలిక అక్రిడిటేషన్ల పక్రియ కాకుండా చిన్న పత్రికలకు జిఎస్టీ తో సంబందం లేకుండా పూర్తి కాలం పనిచేసే అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. కోవిలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. సంక్షేమ కమిటీని ఏర్పాటుచేసి నిధులు మంజూరు చేయాలన్నారు. మీడియా కమిషన్ ఏర్పాటుచేయాలని కోరారు. రాష్ట్ర, జిల్లా మీడియా కమిటీల్లో ఫెడరేషన్ కు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా కు ఫెడరేషన్ నాయకులు, సభ్యులు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ఎస్.ఎస్. జహీర్, జి. ప్రకాశరావు, జి. ప్రేమ్ కుమార్, బి. సురేష్ బాబు, ఎం. రవికుమార్, శ్యామ్ సాగర్, సభ్యులు పి. పున్నయ్య, సాంబశివరావు, భూషణం, డి. కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, తదిరరులు పాల్గొన్నారు.