కాటూరి శిల్పకళా నైపుణ్యం దేశానికే గర్వకారణం


 కాటూరి శిల్పుల శిల్పకళా నైపుణ్యం దేశానికే గర్వకారణం 

- రైల్వే ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ చైర్మన్ రమేష్ చంద్ర రతన్ 

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: 

కాటూరి శిల్పుల శిల్పకళా నైపుణ్యం దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని రైల్వే ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ చైర్మన్ రమేష్ చంద్ర రతన్ అన్నారు. స్థానిక సూర్య శిల్పశాలలో శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు 14 అడుగుల ఎత్తు. రెండు టన్నుల ఐరన్ రొటీతో రూపొందించిన భారత ప్రధాని నరేంద్రమోడీ విగ్రహాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. ఇటీవల ఈ విగ్రహ నిర్మాణం అన్ని మీడియాలో వైరల్ గా మారిన విషయం విధితమే. విభిన్న ఆలోచనలతో సృజనాత్మకంగా శిల్పాలను రూపొందించడంలో కాటూరి శిల్పుల ఖ్యాతి విశ్వవ్యాప్తంగా విస్తరించింది. వరల్డ్ రికార్డులను నెలకొలిపారు కాటూరి శిల్పులు. వీరి శిల్పకళా నైపుణ్యంను ప్రధాని మోడీ విగ్రహం రూపంలో తెలుసుకున్న రమేష్ చంద్ర రతన్ గురువారంప్రధాని విగ్రహాన్ని తిలకించారు. ఐరన్ స్క్రాబ్ తో మనిషి పోలికలతో విగ్రహం రూపొందించడం ఎంతో కష్టతరమని ఏ మాత్రం పోలికలు పోకుండా సజీవంగా ప్రధాని విగ్రహాన్ని సజీవంగా ఆవిష్కరించారని శిల్పులను అభినందించారు. శిల్పుల విశేషాలను ప్రధానికి వివరిస్తామన్నారు. స్కాబ్ తో ఇలాంటి విగ్రహాన్ని తొలి సారిగా చూస్తున్నామన్నారు. శిల్పులు వెంకటేశ్వరరావు, రవిచంద్రలను ఆయన సత్కరించారు. రైల్వే ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ చైర్మన్, భారతీయ జనతా పార్టీ నాయకులు రమేష్ చంద్ర రతన్ కు శిల్పులు కృతజ్ఞతలు తెలిపారు. మెమెంటో, బ్రెస్ట్ సైజ్ ప్రధాని ఫైబర్ విగ్రహాన్ని అందజేశారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ సభ్యులు టి. గంగాధర్, గురవిందర్ సింగ్ పెట్టి, కిషోర్ షాన్ బే, బేబి చాణక్య, రాంవీర్ బట్టి, లాల్ మణిపాల్, గుంటూరు ఏ.డి.ఆర్.ఎం ఆర్ శ్రీనివాస్, సీనియర్ డి.సి.ఎం నరేంద్ర వర్మలు విచ్చేసారు.