భారత ప్రధాని విగ్రహాన్ని రూపొందించిన సూర్య శిల్పశాల శిల్పులు

భారత ప్రధాని విగ్రహాన్ని రూపొందించిన సూర్య శిల్పశాల శిల్పులు

టాలెంట్ ఎక్స్ ప్రెస్:
రెండు టన్నుల ఐరన్ స్క్రాప్ తో, 14 అడుగుల ఎత్తుతో భారత ప్రధాని ప్రధానమంత్రి నరేంద్రమోడీ  విగ్రహాన్ని పట్టణానికి చెందిన సూర్య శిల్పశాల శిల్పులు రూపొందించారు.. ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయుటలో సూర్య శిల్పశాల కు అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నది. వరల్డ్ రికార్డు కోసం ఇటీవల 75 వేల నట్లను ఉపయోగించి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని రూపొందించారు. ఆ విగ్రహాన్ని మీడియా ద్వారా చూసిన బెంగళూరుకు చెందిన ఒక సంస్థ కోరికమేరకు నరేంద్రమోడీ విగ్రహాన్ని ఐరన్ ప్ తో రూపొందించామని, ఐరన్ స్క్రాప్ తో మనిషి పోలికలో అందున ప్రస్తుత ప్రధానమంత్రి విగ్రహం రూపొందించడం అంటే ఎంతో సాహసంతో కూడుకున్నది అని ఏ మాత్రం విగ్రహ రూపం సరిగా లేదు అని పేరు వచ్చినా ఇన్నాళ్ళు వారి సంస్థకు ఉన్న పేరుకు విగూతం కలుగుతుంది అని ముందు సంసయించినా,ధైర్యం చేసి తయారీకి అంగీకరించినట్లు తెలిపారు. రెండు నెలలు నిరంతరం రేయింబవళ్లు శ్రమించి ఈ విగ్రహాన్ని సజీవంగా రావడానికి కృషి చేసామన్నారు. విగ్రహం తయారీలో విజయం సాధించినట్లు భావిస్తున్నామని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రలు తెలిపారు. ఈ విగ్రహాన్ని ఈ నెల 16వ తేదీన బెంగళూరు తరలించనున్నట్లు, బెంగుళూరు లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారన్నారు.  ఈ విగ్రహాన్ని తిలకించిన స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్  తెనాలి కి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అభినందనీయులని కొనియాడారు. ఇలాంటి కళాకారులు తెనాలిలో ఉన్నందుకు తెనాలి శాసన సభ్యునిగా గర్విస్తున్నట్లు చెప్పారు.ఇంకా ఇలాంటి కళ కండాలు ఎన్నో సృష్టించాలని కోరుకుంటున్నామన్నారు.