తెనాలి :ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలువలు, విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇస్తారని అందుకు ఉదాహరణ హెనీ క్రిస్టినా కు దక్కిన జడ్పీ పదవి అని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. షెడ్యూల్ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జెడ్పి చైర్ పర్సన్ హెని క్రిస్టినా కు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి ఐక్యవేదిక నాయకుడు గుంటూరు కృష్ణ అధ్యక్షత వహించారు.హోం మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన క్రిస్టినా సురేష్ దంపతులకు రెండోసారి సీటు రాకపోయినా నిరాశ చెందలేదని జగన్ మాట విన్నందుకు వారికి మంచి ప్రతిఫలం దక్కిందని అన్నారు. ఆయన నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదని చెప్పారు.తన రాజకీయ ప్రస్థానం జెడ్పీటీసీ గా ప్రారంభమైందని ఫిరంగిపురం జడ్పిటిసిగా ఉన్నప్పుడు హార్వెస్ట్ ఇండియా సంస్థ నిర్వాహకులైన సురేష్ దంపతులను ఆరు బోర్లు కావాలి అని అడిగానని వెంటనే వారు స్పందించి వాటిని వేయించాలని అయితే అంతకుముందు ఎప్పుడూ కూడా నీళ్లు పడలేదని అయితే ఈ ఆరు బోర్లలో నీళ్లు వచ్చాయని ఆనందం వ్యక్తం చే...