తెనాలిలో నేను లేని నా ప్రేమ కధ విజయోత్సవం


- తెనాలిలో నేను లేని నా ప్రేమ కధ విజయోత్సవం
- చిత్ర మాటల రచయితకు సత్కారం
 తెనాలి: పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు సాబీర్ షా నేనులేని నా ప్రేమ కధ చిత్రానికి మాటలు అందించి ప్రేక్షకులనుంచి సెహబాష్ అనిపించుకున్నారు. స్థానిక సంగమేశ్వర ధియోటర్ లో శుక్రవారం నేనులేని నా ప్రేమ కథ చిత్రం విడుదలయ్యింది. ఈ సందర్భంగా తొలిసారిగా వెండితెరకు మాటల రచయితగా పరిచయం అయిన సాబీర్ షాను పట్టణంలోని పలువురు కళాకారులు, కళాసంస్థల నిర్వాహకులు ఆయనను అభినందించారు. సరస్వతి క్రియేషన్స్, త్రిషాల్ ఎంటర్ టైనమెంట్ పతాకాలపై లక్షీ. కందుకూరి సమర్పించిన ఈ చిత్రానికి సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించగా నవీన్ చంద్ర, గాయత్రి సురేష్, స్వీటి దివిజ, క్రిష్, అతిది, రాజారవీంద్ర తదితరులు నటీనటులు. ఎస్.ఎ. భూపతి సినిమాటోగ్రాఫర్, జువెన్ సింగ్ సంగీతం అందించారు. ఎడిటింగ్ ప్రవీణ్ పూడి. ముఖ్యంగా ప్రేమైనా పశ్చాతాపం అయినా అది గొంతు పలకాల్సిన 
బాష కాదు, కళ్ళు తెలపాల్సిన భావం. అమాయకత్వం బ్రతికినంతవరకు మోసం గెలుస్తూనే ఉంటుంది. ఏమి జరగలేదు అనుకో జనంతో ఉంటాను, ఏమైనా జరిగితే జనంలో ఉంటాను జ్ఞాపకంగా వంటి ఎన్నో డైలాగ్స్ ప్రేక్షకులకు జ్ఞాపకాలుగా గుర్తుండి పోయేలా సాబీర్ షా మాటలు అందించారు. సకుటుంబ కధా చిత్రాలు లేక, అశ్లీలతతో ఉన్న సినిమాలతో ఉక్కపోతకు గురవుతున్న ప్రేక్షకుల మీద పన్నీటి జల్లు కురిపించింది. ఈ నేను లేని నా ప్రేమకధ చిత్రం. ఎక్కడా సెన్సార్ కత్తెరకు అవకాశమే ఇవ్వకుండా మంచి ఫీల్ తో సాగి ప్రేక్షకులను రంజింపజేసింది. ఫీల్ గుడ్, సైన్స్, లవ్ జోనర్ లో ఆధ్యంతం కొత్తదనంతో అలరించింది. నిన్నటి, నేటి తరాల్ని అలరించే కధనం, యువతను ఆకర్షించే విన్నూత్న ప్రయోగం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తన మాటలతో సినిమాని నెఫ్ట్ లెవల్ కి నడిపించడంలో మాటల రచయిత విజయవంతం అయ్యారు. మాటల రచయితగా సాబీర్ షా తన సమర్ధతను నిరూపించుకున్నారు. చిత్ర ప్రదర్శన అనంతరం సాబీర్‌ షాను షేక్ జానీ బాషా, పూలబాబు, జిలాని, భవాని, వసంత యామిని, సైదా, పెద్దిరాజు, వెంకటేశ్వరరావు, ధియేటర్ యాజమాన్యం రాజు, జీవన్ శ్రీ, దర్శకుడు రత్నాకర్ సత్కరించారు. ప్రత్యేక కేక్ ను సాబీర్ షా కట్ చేశారు. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.