ఎన్‌సీసీ ట్రైనింగ్‌ క్యాంప్‌లో సత్తాచాటిన విజ్ఞాన్స్‌ లారా విద్యార్థులు

ఎన్‌సీసీ ట్రైనింగ్‌ క్యాంప్‌లో సత్తాచాటిన విజ్ఞాన్స్‌ లారా విద్యార్థులు

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఎన్‌సీసీ యాన్యువల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో సత్తాచాటారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన 10ఏ బాలికల ఎన్‌సీసీ బెటాలియన్‌ యాన్యువల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన షేక్‌ నజ్మా సుహానాకు బెస్ట్‌ క్యాడెట్‌ అవార్డు, సోలో డాన్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిందని తెలియజేసారు. అంతేకాకుండా ఈ ట్రైనింగ్‌ క్యాంప్‌లో గ్రూప్‌ డ్యాన్స్‌ విభాగంలో ఎస్‌.తేజస్విని దేవి, బీ.లక్ష్మీ సాత్విక భాయ్, కమలశ్రీలకు గోల్డ్‌ మెడల్, వకృత్వ పోటీలో కే.కమలశ్రీకు గోల్డ్‌ మెడల్, డ్రిల్‌ విభాగంలో డీ.సజనాబీ, బీ.రాగిణి వైష్ణవీలకు సిల్వర్‌ మెడల్, ఫైరింగ్‌ విభాగంలో ఎస్‌.డీ.మారూఫాకు సిల్వర్‌ మెడల్‌ లభించిందని పేర్కొన్నారు. మెడల్స్‌ సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎన్‌సీసీ కేర్‌ టేకర్‌ బీ.వరలక్ష్మి, ఆయా విభాగాల అధిపతులు అభినందించారు.