Skip to main content

షెడ్యూల్ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జెడ్పి చైర్ పర్సన్ హెని క్రిస్టినా కు ఘన సత్కారం

తెనాలి :ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలువలు, విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇస్తారని అందుకు ఉదాహరణ హెనీ క్రిస్టినా కు దక్కిన జడ్పీ పదవి అని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. షెడ్యూల్ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జెడ్పి చైర్ పర్సన్ హెని క్రిస్టినా కు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి ఐక్యవేదిక నాయకుడు గుంటూరు కృష్ణ అధ్యక్షత వహించారు.హోం మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన క్రిస్టినా సురేష్ దంపతులకు రెండోసారి సీటు రాకపోయినా నిరాశ చెందలేదని జగన్ మాట విన్నందుకు వారికి మంచి ప్రతిఫలం దక్కిందని అన్నారు. ఆయన నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదని చెప్పారు.తన రాజకీయ ప్రస్థానం జెడ్పీటీసీ గా ప్రారంభమైందని ఫిరంగిపురం జడ్పిటిసిగా ఉన్నప్పుడు హార్వెస్ట్ ఇండియా సంస్థ నిర్వాహకులైన సురేష్ దంపతులను ఆరు బోర్లు కావాలి అని అడిగానని వెంటనే వారు స్పందించి వాటిని వేయించాలని అయితే అంతకుముందు ఎప్పుడూ కూడా నీళ్లు పడలేదని అయితే ఈ ఆరు బోర్లలో నీళ్లు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా స్కూళ్లలో  అడిగిన వారికి అడ్మిషన్ లేదనకుండా ఇచ్చారని ఇది వారి మంచితనానికి నిదర్శనమని అన్నారు. ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ మంచికి మంచి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వారికి ఏ మేలు కొదవ ఉండదని తెలిపారు. తెనాలి, వేమూరు ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, మేరుగ నాగార్జున మాట్లాడుతూ సహనం, ఓర్పుకు, మంచితనానికి నిదర్శనం క్రిస్టినా దంపతులని పేర్కొన్నారు. వారు జగన్ మాట విన బట్టి వారికి మంచి జరిగిందని,తెనాలి ప్రాంతం వారికి అత్యున్నత పదవి లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతం నుండి గతంలో అనేకమంది ఎన్నికయ్యారని వారి కంటే మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ క్రిస్టీనాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మోపిదేవి వెంకటరమణ, మునిసిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీం,వైసీపీ రాష్ట్ర నాయకులు కత్తెర సురేష్ కుమార్,ఎంపిపి చెన్నుబోయిన శ్రీనివాసరావు, జడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి,కోడూరు స్వప్న తదితర వైసీపీ నాయకులు హాజరయ్యారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...