Skip to main content

Posts

Showing posts from November, 2021

కవితా తోటమాలికి

పాటల వేటగానికి మాటల భావ మౌనికి కవితా తోటమాలికి అక్షర అశ్రుతాంజలి! సాహితీ బాటసారికి స్మిత మిత వచో శౌరికి గీతా గానధారికి  అక్షర అశ్రుతాంజలి! సాదర స్నేహశీలికి ప్రియతమ ప్రేమ పాణికి పదముల ధైర్యశాలికి అక్షర అశ్రుతాంజలి! కణ కణ కాంతి ద్రోణికి నవరస కవన వేణికి విలువల కలువ రేనిక అక్షర అశ్రుతాంజలి! అభినవ వాణి బాణికి శాశ్వత చరిత ప్రాణికి వెన్నెల సిరుల శ్రేణికి అక్షర అశ్రుతాంజలి!              💐🙏🏻💐          పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి.

తెలుసా...మనసా...!

తెలుసా...మనసా...! పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డ అన్నా..., శివరంజని,భవభంజని అన్నా..., భద్రం బి కేర్ ఫుల్ బ్రదర్ అన్నా.., మంచు తాకిన ఈవనం అన్నా.., కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు అన్నా..., బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది అన్నా.., బలపం పట్టి భామ బళ్లో అన్నా..., అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్రమందామా అన్నా.., సంతోషం సగం బలం అన్నా.., గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా అన్నా..., సామాజవరగమనా అన్నా... ఇలా ఏరసమైనా అతని కలం చివరన పాదరసమే..! సందర్భమేదైనా, ఎలాంటి విషయమైనా సీతారాముని సాహిత్యోప్రవేశం అనితర సాధ్యం...! ఆదిభిక్షువుని ఆవహించుకున్న సాహిత్య పిపాసి.., గ్రాంథిక,అంత్య ప్రాసలతో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా సాహిత్యాన్ని కొంగ్రొత్త తీరాలవైపు తీసుకెళ్లిన అమృత హృదయుడు.., అసభ్యతకు తావులేని రాత, తత్సంప్రదాయాల కలబోత.., ఆయన అక్షర తూణీరాలను నిలువెల్లా నింపుకున్న తెలుగువారు కోకొల్లలు.. తెలుగు సినిమా,పాట ఉన్నంతకాలం ఈయన సాహిత్యం నిత్య నూతనం...మనందరి మదిలో, గొంతులో, మనసులో పదిలం...        #teampalletour❤️🙏🏻 😓#palletour💚  #ripsir

అక్షరాల మాంత్రికుడు అలసినాడేమెా..

అక్షరాల మాంత్రికుడు అలసినాడేమెా జగమంతా కుటుంబం నాదని ఏది శాశ్వతం కాదని హితమేదో చెపుతుా జామురాతిరంటుా జాబిలమ్మ కబుర్లెన్నో పోసి ఒప్పుకోవద్దు ఓటమి అని సందేశాత్మక సుాచనలే కుార్చి నమ్మకు నమ్మకు ఈ రేయి అంటుా జాగృతి పరుస్తుా కళ్ళలో కళ్లుపెట్టి చుాడు అంటుా ప్రేమసందేశం జోడిస్తుా బోటని పాటముందని యువతను ఆకర్షిస్తుా సాహిత్యాన్ని విప్లవాన్ని జోడిస్తుా నిగ్గదీసి అడగమంటుా సమాజాన్ని ప్రశ్నిస్తుా అక్షరాలు ముద్దాడిన రాగాల అద్భుతాలను అందిస్తుా సిరివెన్నెల జిలుగులై రాలిన పదాలను తాకిన గేయాలన్ని అద్భుతాలై భావాల పల్లకిలో అలలై కలలై నిత్యం వలపులని తలపులని గెలుపులని నిజాలని సత్యాలై హృది తడిపే పాటల ఏరులై మనసంతా నువ్వేనని వెన్నెల కురిపించి తెలుగువారి వాకిటిలో స్వర్ణకమలాలే పుాయించి సామజవరగమనంటుా హృదయాలను ఉర్రుాతలుాగించి ముందు తరాలకు మార్గదర్శియై పదకొండు నంది ఆవార్డులకే వన్నెతెచ్చి పద్మశ్రీ ఆవార్డు మెప్పుపొంది రాసిన ప్రతి గేయం అపురుాపమై తనదంటుా ఏమిలేదని ప్రజాల మది గుడియె గుడిగంటలని శృతిలయలలో ఐక్యమై కవిగా రచయితగా గాయకుడిగా రచయితగా తెలుగు బాషకు నీరాజనమే పట్టి విలువల శిఖరమెక్కి... అర్ధరాత్రి సుార్యుడు గగన...

తరలి వెళ్ళింది వసంతం తన దరికి రాని వనాలకోసం

తరలి వెళ్ళింది వసంతం  తన దరికి రాని వనాలకోసం జగమంత సినీ కుటుంబాన్ని  ఏకాకిని చేసి సంగీత సాగరాన్ని శూన్యం చేసి ఈ నేల ఈ గాలి నీ పాట విన్న ప్రతి వాళ్లు నిగ్గదీసి ఎవరిని అడగాలి ? మూడు దశాబ్దాల నీ సాహిత్యసేవ ఎవరు పూడ్చాలి ?? సిరివెన్నెల లేని వెండితెరను విధాత మా తలపు కైనా రానివ్వలేదే మరణమనేది ఎవరికైనా ఖాయమే ఒక్కడే రావచ్చు  ఒక్కడై పోవచ్చు కానీ కవివై కవితవై పాటవై మాటవై మాలో వుంటూ మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా నిష్క్రమించ వచ్చా?? నీ బూడిదిచ్చిన  ఆ ఆదిభిక్షువు వాడికి చెప్పండి మా మదిలో మీ కలానికి గళానికి లేదు మరణం ఎన్నటికీ - కొప్పుల వసుంధర

సినీ గేయరచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కన్నుమూత

సినీ గేయరచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కన్నుమూత . తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి ఇక లేరు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. సీతారామశాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాధ చాయలు అలముకున్నాయి. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున’ గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. దాదాపు 800లకు చిత్రాల్లో 3వేలకు పైగా పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. చెంబోలు సీతారామశాస్త్రి 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్‌.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. దిగువ మధ్య తరగతి కుటుంబం. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్‌, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో బి.ఎ.పూర్తి చేశారు. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తు...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ భాగానికి చెందిన అప్పన సాయి మణిదీప్‌ తమ యూనివర్సటీ   పీహెచ్‌డీ పట్టా అందించిందని ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ అనలైజింగ్‌ ద మీడియేటింగ్‌ రోల్‌ ఆఫ్‌ సర్వీస్‌ క్వాలిటీ ఆన్‌ కంజూమర్‌ రీపర్చేజ్‌ ఇంటెన్షన్‌ ఇన్‌ వెల్‌నెస్‌ ఇండస్ట్రీ: ఆన్‌ ఎక్స్‌టెన్షన్‌ టు «థియరీ ఆఫ్‌ ప్లాన్డ్‌ బిహేవియర్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.శివకోటిరెడ్డి గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం 7 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్, 3 నేషనల్, 2 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు.

పర్యాటక ప్రదేశం

పర్యాటక ప్రదేశం హైదరాబాద్ నుండి సోమశిల మీ వీకెండ్ లో వెళ్లగలిగిన ఉత్తమ పర్యాటక ప్రదేశం . ట్రావెల్ ఇండియా మీకు అందిస్తుందిఊ శ్రీశైలం దేవస్తానమ్  మరియు శ్రీశైలం నుండి స్పెషల్ క్రూజ్ ( బోట్)లో  సోమశీల నదీ విహార   ఉత్తమ పర్యాటక యాత్ర ...హైదారాబాద్ నుండి .. రెండు రోజుల స్పెషల్ టూర్ .. మొదటి రోజు : Every Saturday ఉదయం 9 గంటలకు హైదారాబాద్ నుండి బస్ ( నాన్ ఏ,సీ ) బయలు దేరును. రాత్రికి శ్రీశైలం లో బస . రెండోవ రోజు : ఉదయం 9 గం.లకు శ్రీశైలం నుండి సోమశీల కు బోట్ లో ప్రయాణం . సాయంత్రం 5 గంటలకు సోమశీల నుండి హైదారాబాద్ కు ప్రయాణం రాత్రి 9 గంటకు హైదారాబాద్ చేరుట . పాకేజ్ లో మీకు నాన్ ఏ.సీ. బస్ , రాత్రికి శ్రీశైలం లో వసతి , బోట్ చార్జ్ , ఒక రుచికరమైన భోజనం బోట్ లో . ప్రభుత్వ రంగ పర్యాటకం అందిస్తున్న ఈ విహారాన్ని తప్పక ఆస్వాదించండి.  Price: పెద్దవారికి : 3999/-           చిన్నవారికి : 3199/-  టిక్కెట్స్ కోసం  ట్రావెల్ ఇండియా  ప్రభుత్వ రంగ పర్యాటక బుకింగ్ ఏజన్సీ  9848829574  8801393100  మీ మిత్రులకు తెలియ చేయండి .....

సవాళ్లను స్మార్ట్‌గా అధిగమించాలి

సవాళ్లను స్మార్ట్‌గా అధిగమించాలి   ఇంటర్నేషనల్‌ మోటివేషనల్‌ స్పీకర్, యూత్‌ కౌన్సిలర్, గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ విజేత రాధేశ్యామ్‌ దాస్‌   విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా ఆర్ట్‌ ఆఫ్‌ స్మార్ట్‌ వర్క్‌పై ప్రత్యేక అతిథి ఉపన్యాసం విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్మార్ట్‌ వర్క్‌తో స్మార్ట్‌గా అధిగమించాలని ఇంటర్నేషనల్‌ మోటివేషనల్‌ స్పీకర్, యూత్‌ కౌన్సిలర్, గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ విజేత రాధేశ్యామ్‌ దాస్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ యాక్టివిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ‘‘ ఆర్ట్‌ ఆఫ్‌ స్మార్ట్‌ వర్క్‌’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ యూత్‌ కౌన్సిలర్, గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ విజేత రాధేశ్యామ్‌ దాస్‌ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో మూడు ( బుక్‌ ఆఫ్‌ యువర్‌ లైఫ్, సెల్ఫ్‌ టెస్ట్‌ పర్సనాలిటీ టైప్, స్మార్ట్‌ టైమ్‌ మేనేజర్‌) టిప్స్‌ను పాటించాలన్నారు. విద్యార్థులకు క్రియేటివిటీ మైండ్‌ సెట్‌తో పాటు అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ థింకింగ్‌ ఉండాలన్...

జెఎంజె కళాశాల్లో ఎన్‌సిసి డే

ప్రన్యూషను అభినందిస్తున్న కళాశాల బృందం  జెఎంజె కళాశాల్లో ఎన్‌సిసి డే   టాలెంట్ ఎక్స్ ప్రెస్ తెనాలి : స్థానిక జెంఎజె మహిళా కళాశాల్లో ఆదివారం ఎన్‌సిసి డే నిర్వహించారు. ఎన్‌సిసి ఆంధ్రా బాలికల బెటాలియన్ ఆధ్వర్యంలో 73వ ఎన్‌సిసి డే వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా ఆర్ వి ఆర్ జేసి ఇంజినీరింగ్ కళాశాల ఎఎస్ఆ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ జె.ఉషాక్రాంతి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఎస్సిసితో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం సీనియర్ ఆఫీసర్ జె.ప్రన్యూషను సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్  షైనీ, వైస్ ప్రిన్సిపల్ అరుణారాణి, ఎఎస్ఆ లెఫ్టినెంట్ పాముల కీర్తన పాల్గొన్నారు. 

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకుడికి డాక్టరేట్‌ ప్రధానం

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకుడికి డాక్టరేట్‌ ప్రధానం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ముక్కు వెంకటయ్యకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఇన్విస్టిగేటింగ్‌ మెకానికల్‌ ప్రాపర్టీస్, మెషినింగ్‌ క్యారక్టెరిస్టిక్స్, కొర్రోజిన్‌ అండ్‌ వేర్‌ బిహేవియర్‌ ఆఫ్‌ ఫైన్‌ గ్రేయిన్డ్‌ జడ్‌ఈ41 మెగ్నిషియం అలాయ్‌ ప్రొడ్యూస్డ్‌ బై ప్రిక్షన్‌ స్టిర్‌ ప్రాసెసింగ్‌’’ అనే అంశంపై  పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ప్రొఫెసర్‌ డాక్టర్‌ కే.వెంకటరావు గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా 4 పేపర్లు ప్రచురించారు. ఇందులో 2 పేపర్లు స్కోపస్, 2 ఎస్‌సీఐఈ పేపర్లు, 3 ఇంటర్‌ నేషనల్‌ పేపర్లు, ఒక ఇండియన్‌ పేటెంట్‌ సాధించారని పేర్కొన్నారు.

బొల్లిముంత శివరామకృష్ణ జయంతి సందర్భంగా

💐💐🙏అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. మార్క్సిస్టు గాంధీ గా పిలవబడే సాహితీ మృత్యుంజయుడు శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ జయంతి సందర్భంగా 🙏💐💐 మనిషి జీవితం అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది సామాజిక అస్తిత్వం-సామాజిక చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది అన్న దృక్పథంతో రచనలు చేసిన అగ్రశ్రేణి అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణయ్య. *ఉపాధ్యాయుడు, హార్మోనిస్టు,నటుడు, గాయకుడు,కవి, కథా రచయిత, నవలాకారుడు, బుర్రకథా రచయిత, హరికథా రచయిత, జర్నలిస్టు, సినిమా రచయిత, అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు, రాజకీయ కార్యకర్త, ఉత్తమ కమ్యూనిస్టు బొల్లిముంత.* *తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్ద విప్లవం.* *మార్క్సిస్టు గాంధీ అని కూడా అంటారు.* *బాల్యం-విద్యాభ్యాసం:* 1920 నవంబరు 27వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు మండలం, చదలవాడలో శ్రీమతి మంగమ్మ-, శ్రీ అక్కయ్య దంపతులకు పుట్టిన శివరామకృష్ణయ్య ప్రాథమిక, మాధ్యమిక విద్య తమ స్వగ్రామంలో కొనసాగించి, గుంటూరులో హయ్యర్‌గ్రేడ్‌ శిక్షణ పూర్తి చేశారు. సంస్కృతాన్ని, సంగీతాన్ని స్వయంకృషితో నేర్చుకున్నారు. చదలవాడలో ఆయన తండ్రి నెలకొల్పిన పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు....

క్రానియన్ చర్చ్ ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకలు

స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళాశాలలో    క్రానియన్ చర్చ్ ఆధ్వర్యంలో శనివారం సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ త్రో బాల్ కెప్టెన్ సునీల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వర రావు మాట్లాడుతూ యేసు క్రీస్తు కృప తో గత మూడు రోజులుగా క్రానియన్ చర్చి వారు సువార్త కూడికలు నిర్వహించడం అభినందనీయమన్నారు. . ప్రేమ, కరుణ, అందరికీ పంచాలని ఏసుక్రీస్తు చెప్పినట్టుగా వారి బోధనలు ఆచరించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు గుర్తించి వారికి మంచి మనసుతో నూతన వస్త్రాలు బహిష్కరించడం ఆనందించదగ్గ విషయం మన్నారు.జాతీయ త్రో బాల్   కెప్టెన్ చావలి సునీల్ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని, వారిని గౌరవించడం మన బాధ్యతగా భావించాలని తెలిపారు. సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నా పున్నయ్యను ఆయన అభినందించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రా...

విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి ఆస్ట్రేలియన్‌ పేటెంట్‌

విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి ఆస్ట్రేలియన్‌ పేటెంట్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కొణిదల సతీష్‌ కుమార్‌కు ఆస్ట్రేలియన్‌ పేటెంట్‌ మంజూరైందని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ కంప్యూటర్‌– ఏయిడెడ్‌ మాలిక్యులర్‌ డాకింగ్, ఫిజికో కెమికల్‌ అండ్‌ ఏడీఎంఈటీ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ నోవల్‌ బ్రోమోపిరిమిడిన్‌ అనాల్గ్స్‌ యాస్‌ పొటెన్షియల్‌ ఆంటీ–క్యాన్సర్‌ ఏజెంట్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను ప్రముఖ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీస్‌ ఆస్ట్రేలియన్‌ అథారిటీ పేటెంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. ఈ పేటెంట్‌ ద్వారా కొత్త క్యాన్సర్‌ నిరోధక బ్రోమోపిరిమిడిన్‌ మాలిక్యూల్స్, ఫిజికో కెమికల్స్, ఏడీఎంఈటీ లక్షణాలను ఇన్‌సిలికో పద్ధతుల ద్వారా అన్వేషణను హక్కులుగా వచ్చే 8 సంవత్సరాల పాటు పొందారని పేర్కొన్నారు. ఈ పేటెంట్‌ను యూఏఈలోని అజ్మాన్‌ యూనివర్సిటీ, బెంగళూరులోని బీఎంఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజ...

ఈ నెల 28న బొల్లిముంత శివరామకృష్ణ జయంతి

రూ.15 లక్షల వేతన ఉద్యోగం సాధించిన విజ్ఞాన్స్‌ విద్యార్థి

రూ.15 లక్షల వేతన ఉద్యోగం సాధించిన విజ్ఞాన్స్‌ విద్యార్థి చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన శ్రీపతి వంశీకృష్ణ అనే విద్యార్థి రూ.15 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగం సాధించాడని ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థికి ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సీఎస్‌ఈ విభాగానికి చెందిన నాలుగో సంవత్సరం విద్యార్థి శ్రీపతి వంశీకృష్ణ ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీ సిస్కో సిస్టమ్స్‌కు ఎంపికయ్యాడని తెలియజేసారు. ఈ విద్యార్థి ఏడాదికి రూ.15 లక్షల వార్షిక వేతనం అందుకోనున్నాడని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వంశీకృష్ణ వివిధ రకాల క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనడంతో పాటు ఎన్‌పీటీఈఎల్, కోర్సెరా, ఎడ్యుస్కిల్స్‌ వంటి కోర్సులను పూర్తి చేయడం వలనే ఉన్నత కంపెనీలో ఉద్యోగం సాధించాడని వెల్లడించారు. శ్రీపతి వంశీకృష్ణకు మొదటి సంవత్సరం నుంచి యూనివర్సిటీ ఫీజులో 50 శాతం రాయితీను కూడా అందించిందన్నారు. సిస్కో సిస్టమ్స్‌ కంపెనీలో రూ.15 లక్షల వార్షిక వేతనం ఉద్యోగం సాధించిన  శ్రీపతి వం...

జనవరిలో విశాఖ లో స్క్రిప్ట్ టు స్క్రీన్ వర్క్ షాప్..

గుంటూరు రైల్వే డివిజన్‌లోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలి

*గుంటూరు రైల్వే డివిజన్‌లోని పలు రైల్వే సమస్యలకు పరిష్కారం కోరుతూ.. నేడు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని విష్ణవ్‌ గారిని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కలిశారు.* ▪️ గుంటూరు రైల్వే స్టేషన్‌ రిమోడలింగ్‌ (పునర్మిర్మాణం) ప్రక్రియను కొనసాగించాలని..  రిమోడలింగ్‌కు ఎన్నో ఏళ్ల తర్వాత రూ.80కోట్లు కేటాయించబడ్డాయని, అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం రద్దు చేయబడిందని, మంజూరైన నిధులను ఇతర రైల్వే డివిజన్‌లకు కేటాయిస్తున్నారని మంత్రి గారికి విన్నవించారు.  రాష్ట్రంలో గుంటూరు రైల్వే స్టేషన్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. నిధులు మరలా  కేటాయించి ప్రాజెక్ట్ ను కొనసాగించాలని కోరారు. ▪️ ప్రజలు, రైతుల ప్రయోజనాల దృష్ట్యా లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ల స్థానంలో అవసరమైన చోట ఆర్‌యుబిలు, ఆర్‌ఓబీల నిర్మాణాలు చేపట్టాలని...  గుంటూరు డివిజన్‌లోని లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ల సంఖ్యలు– 27, 40, 53, 64, 81, 89, 106, 263, 264, 257, 269, 283, 287, 50, 57, 60, 61, 69, 71, 72, 75, 80 గేట్‌లను మార్చాలని విన్నవించారు. ▪️అలాగే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (02795) నడికుడి జంక్షన్‌...

మన రాజ్యాంగం మహోన్నతం

మన రాజ్యాంగం మహోన్నతం   ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ యూ.దుర్గా ప్రసాద్‌రావు   విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా నేషనల్‌ లా డే వేడుకలు ప్రపంచ దేశాలలోని రాజ్యాంగాలలో మన దేశ రాజ్యాంగం మహోన్నతమైనదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ యూ.దుర్గా ప్రసాద్‌రావు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ లా డేను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ యూ.దుర్గా ప్రసాద్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు న్యాయ శాస్త్రాన్ని అభ్యసించి సమాజంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం దక్కేలా కృషి చేయాలన్నారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థులు ప్రతి రోజు కొత్త విషయాలను, సరికొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.  భారత పౌరులు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కాపాడుటకు రాజ్యాంగంలో సమానత్వపు హక్కు, వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్య్రపు హక్కు, దోపిడీను నిరోధించే హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు, విద్య, సాంస్కృతిక హక్కులను రాజ్యా...

ఇక పై ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలు

ఇక పై ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలు - దోపిడీని అడ్డుకునేందుకే ఆన్‌లైన్‌ టికెట్ల విధానం    మంత్రి పేర్ని నాని టాలెంట్ ఎక్స్ ప్రెస్: సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఏపీ రవాణా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను విక్రయించడం, నిర్దేశిత ఆటలతోనే సినిమాలు ప్రదర్శించడం, పన్ను ఎగవేతను అడ్డుకోవడమే ఈ విధానం లక్ష్యమన్నారు.

ఆర్కిటెక్ నీలా కోటేశ్వరరావు గారికి అభినందనలు..

తెలంగాణా రాష్ట్రం లో అతిపెద్ద చర్చీలలో ఒకటిగా ఉన్న కల్వరి చర్చ్ కి ఆర్కిటెక్ గా పనిచేసి అత్యంత ప్రతిభ చూపిన మిత్రుడు, క్లాస్ మేట్, జోవెన్ ఇన్ ఫ్రా, జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ ల అధినేత నీలా కోటేశ్వరరావు కు అభినందనలు.  భవిష్యత్ లో మరిన్ని అద్భుతమైన కట్టడాలను మీ చేతులమీదుగా నిర్మించాలని మనసారా కోరుకుంటూ.. - రత్నాకర్ కనపర్తి,    దర్శకుడు, జర్నలిస్ట్

క్రిస్మస్ నెల ప్రారంభం సందర్భంగా ఈ రోజు టౌన్ చర్చ్ పై అలంకరించిన భారీ స్టార్

క్రిస్మస్ నెల ప్రారంభం సందర్భంగా ఈ రోజు టౌన్ చర్చ్ పై అలంకరించిన భారీ స్టార్

జాతీయస్థాయిలో మెరిసిన విజ్ఞాన్స్‌ విద్యార్థిని

జాతీయస్థాయిలో మెరిసిన విజ్ఞాన్స్‌ విద్యార్థిని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన కుందేటి యామినికి ఎంహెచ్‌ఆర్‌డీ ( మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌)కు చెందిన అనుబంధ సంస్థ ఉన్నత భారత అభియాన్‌ నిర్వహించిన జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ వీడియో కాంపిటీషన్‌ పోటీలలో తృతీయ బహుమతి లభించిందని ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం ఫుడ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన కుందేటి యామిని అనే విద్యార్థిని ఉన్నత భారత అభియాన్‌ నిర్వహించిన కోవిడ్‌–19 అవగాహనకు చెందిన ‘‘ ఫోకసింగ్‌ ఆన్‌ అవేర్‌నెస్‌ థాటౌట్‌ ద పాండమిక్‌’’ అనే అంశంపై నిర్వహించిన వీడియో కాంపిటీషన్‌ పోటీలలో జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి లభించిందన్నారు. జాతీయస్థాయిలో జరిగిన ఈ పోటీలలో దాదాపు 750 కాలేజీలు, యూనివర్సిటీల నుంచి విద్యార్థులు పాల్గొనగా, తమ వర్సిటీకు చెందిన విద్యార్థిని ఉత్తమ ప్రతిభ చూపి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందుకుందని వెల్లడించారు. జాతీయస్థాయిలో ప్రత...

తెనాలిలో ఎం అండ్ ఎం మొబైల్ షో రూమ్ ప్రారంభం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్ర ప్యారిస్ తెనాలి పట్టణం లో బుధవారం అతి పెద్ద మొబైల్ షోరూం ఎం అండ్ ఎం శాఖను ప్రారంభించారు. స్థానిక బోస్ రోడ్ లోని నూతన మొబైల్ షో రూమ్ ను ప్రఖ్యాత సినీ కధానాయకి కామ్నాజెట్మలాని ముఖ్య అతిధిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంతగాల వారికి ఇప్పుడు మొబైల్ రంగం లో పేరుగాంచిన అతిపెద్ద సంస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇండస్ట్రియల్ మేనేజర్ మధు మదన్ మాట్లాడుతూ కేవలం లాభాపేక్ష కాకుండా నాణ్యమైన సేవలను ఎం అండ్ ఎం అందించాలన్నారు. సంస్థ నిర్వాహకులు ఆడం నూర్ భాష షఫీ, విచ్చారపు కృష్ణ గౌడ్, షేక్ వలి లు మాట్లాడుతూ తమ వద్ద ఒప్పో, రెడీమీ, సామ్ సంగ్ అన్నిరకాల మొబైల్స్ తో పాటు లాప్ టాప్ లు అందుబాటు ధరల్లో లభిస్తాయని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ లు ఇస్తున్నట్లు చెప్పారు.

ఏపీ రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన

ఏపీ రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ కీలక  ప్రకటన . ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించిన అనంతరం సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. 3 రాజధానుల బిల్లును మెరుగుపరుస్తామని తెలిపారు. పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామని చెప్పారు. ‘‘కనీస వసతుల కల్పనకు అంత డబ్బులేనప్పుడు రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యం అవుతుందా? రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే గతంలో విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేశాం. రాజధానిపై మా నిర్ణయాన్ని ఈ రెండేళ్లలో రకరకాలుగా వక్రీకరించారు. వికేంద్రీకరణ సరైన మార్గమని నమ్మి చర్యలు చేపట్టాం. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఇప్పటికీ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేవి. సమగ్రమైన బిల్లుతో మళ్ళీ సభ ముందుకు వస్తాం. అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా ఈ సారి కొత్త బిల్లు పెడతాము.’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ‘‘శ్రీ‌కృష్ణ క‌మిటీ నివేదిక‌ను ఉల్లంఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజ‌ధాని ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేక‌త లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రా...

విజ్ఞాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా ఆధ్వర్యంలో ఉచిత లీగల్‌ ఎయిడ్‌ క్యాంప్‌

విజ్ఞాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా ఆధ్వర్యంలో ఉచిత లీగల్‌ ఎయిడ్‌ క్యాంప్‌ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో తెనాలి సమీపంలోని అంగళకుదురులో ఉచిత లీగల్‌ ఎయిడ్‌ క్యాంప్‌ను నిర్వహించామని వర్సిటీ లా డైరక్టర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లా డైరక్టర్‌ మాట్లాడుతూ ఇటువంటి ప్రోగ్రామ్స్‌ వల్ల కోర్టుకు వెళ్లకుండానే గ్రామంలోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పెరుగుతుందన్నారు. గ్రామానికి చెందిన ఒక గృహ హింస కేసుకు తగిన పరిష్కారం అందించి వారికి కౌన్సిలింగ్‌ చేశామన్నారు. అంతేకాకుండా అట్రాసిటీ కేసుకు సంబంధించి సలహాను ఇవ్వడం జరిగిందన్నారు. చట్ట పరిమితిలో అవకాశం ఉన్న భూ వివాదం కేసుకు పరిష్కార సూచనను అందించామన్నారు. కోర్టుకు వెళ్లకుండా పరిష్కార మార్గాలు ఉన్నాయి... అవి మన గ్రామ పరిధిలోనే పరిష్కరించుకోవచ్చు. అందులో మీడియేషన్, కన్సీలియేషన్‌ మరియు కౌన్సిలింగ్స్‌ ద్వారా 90 శాతం కేసులు పరిష్కారం అవుతాయని గ్రామస్తులకు వెల్లడించారు. ఈ విధంగ...

ఎం అండ్ ఎం నూతన ప్రారంభం..తెనాలి లో..

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన పి.విజయలక్ష్మికి  తమ యూనివర్సటీ   పీహెచ్‌డీ పట్టా అందించిందని ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ డిజైన్‌ ఆఫ్‌ లో పవర్‌ అనలాగ్‌ ఫ్రంట్‌ ఎండ్‌ ఇంటెండెడ్‌ ఫర్‌ ఈసీజీ సిగ్నల్‌ అక్విజిషన్‌ సిస్టమ్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేశారు.  ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.శారద, హర్యానాలోని గురుగ్రామ్‌ కేఆర్‌ మంగళం యూనివర్సిటీ ప్రో వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ అవిరేని శ్రీనివాసులు సంయుక్త  గైడ్‌లుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 1 ఎస్‌సీఐ, 1 ఈఎస్‌సీఐ, 3 స్కూపస్‌ జర్నల్‌ పబ్లికేషన్, ఒక స్కూపస్‌ బుక్‌ చాప్టర్, 2 ఐఈఈఈ కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని తెలియజేసారు.

వినియోగదారుల శ్రేయస్సే తమ బ్యాంకు లక్ష్యం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: వినియోగదారుల శ్రేయస్సే తమ బ్యాంకు లక్ష్యమని బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు ఏరియా మేనేజర్ కె .ఎస్. పవన్ కుమార్ చెప్పారు తెనాలి  బుర్రిపాలెం రోడ్డులో టీ. జీ.కేకళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఖాతాదారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వినియోగదారులకు అవసరమైన రుణాలను తక్కువ వడ్డీకేఅందిస్తామని తెలిపారు. వ్యవసాయానికి, పశు సంపదకు, ల్యాండ్ డెవలప్మెంట్ కు ,చదువుకునే విద్యార్థులకు నర్సరీలు పెంచుకునేందుకు, రుణాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏ బ్యాంకు ఇవ్వని విధంగా అందరికీ రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వ్యాపారులు కూడా రుణ సదుపాయం అందిస్తున్నట్లు చెప్పారు. చిన్న బడ్డీ కొట్టు  దగ్గర్నుంచి పెద్ద పరిశ్రమల వరకు రుణాలు ఇస్తామన్నారు. గృహాలకు 6.5 శాతం వడ్డీ అంటే కేవలం 53 పైసలు పడుతుందని చెప్పారు. వాహనాలు కూడా అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామన్నారు. హౌసింగ్ లోన్ లు రెండు సంవత్సరాల పాటు కడితే వారు ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి వస్తే ఇంకా తక్కువ అని చెప్పారు. అదేవిధంగా హౌస్ సైట్ వ్యాల్యూ ని బట్టి 75 శాతం వరకు రుణాలు ఇస్తామని వెల్లడించారు. పర్సనల...

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటూ ప్రకటన చేయడం హర్షంనీయం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: యేడాది కాలంగా రైతుల సాగిస్తున్న ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటూ ప్రధాని ప్రకటన చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్) ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ (ఎ.పి.బి.జె.ఎ)లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో దేశంలోని కార్మికుల కోసం ఉన్న చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు కోట్లను ప్రవేశపెట్టారు. రద్దయిన చట్టాల్లో వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన రెండు చట్టాలు కూడా ఉన్నాయి. ఈ చట్టాల రద్దు కోరుతూ పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జర్నలిజం మిలిగిన వృత్తుల కంటే భిన్నమైనదని, ప్రత్యేకమైనదని కనుక ఆ చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దులో భాగంగా ఈ రెండు చట్టాలను కూడా రద్దుల జాబితాలో చేర్చింది. దేశవ్యాప్తంగా కార్మికలోకం కార్మిక చట్టాల రద్దును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నది. దేశంలోని జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్టు (ఎన్.ఎ.జె) దాని అ...

తైక్వాండోలో విజ్ఞాన్స్‌ విద్యార్థులకు 3 స్వర్ణాలు

తైక్వాండోలో విజ్ఞాన్స్‌ విద్యార్థులకు 3 స్వర్ణాలు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ అమేట్యూర్‌ తైక్వాండో అసోసియేషన్‌ ఇటీవల తిరుపతిలో నిర్వహించిన రెండో ఇంటర్‌ స్టేట్‌ తైక్వాండో చాంపియన్‌షిప్స్‌–2021లో 3 స్వర్ణపతకాలు, ఒక కాంస్య పతకం లభించాయని ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో నాలుగో సంవత్సరం బయోటెక్నాలజీకు చెందిన టీ.జస్వంతి (అండర్‌ 53 కిలోల విభాగంలో), సెకండ్‌ బీసీఏకు చెందిన ఎస్‌కే అస్విల్‌ అహ్మద్‌ ( అండర్‌ 68 కిలోల విభాగంలో), బీబీఏ రెండో సంవత్సరానికి చెందిన షేక్‌ రఫీలు ( అండర్‌ 80 కిలోల విభాగంలో) స్వర్ణ పతకాలు సాధించారని, మూడో సంవత్సరం బీఫార్మసీకు చెందిన ప్రసంజీత్‌ కుమార్‌కు 68 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించారని పేర్కొన్నారు. రెండో ఇంటర్‌ స్టేట్‌ తైక్వాండో చాంపియన్‌షిప్స్‌–2021లో మొత్తం నాలుగు రాష్ట్రాలకు చెందిన 500 మంది విద్యార్థులు పాల్గొనగా తమ యూనివర్సిటీకు చెందిన 4గురు విద్యార్థులకు పతకాలు రావడం...

సినీరచయిత సాయిమాధవ్ బుర్రాకు డాక్టరేట్

సినీరచయిత సాయిమాధవ్ బుర్రాకు డాక్టరేట్   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించి కాలిఫోర్నియాకు చెందిన న్యూలైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు ఆయనకు డాక్టరేట్ ప్రకటించారు. సాయిమాధవ్ బుర్రా బుధవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఈ గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. అనంతరం ఈ పురస్కారాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లుగా సాయిమాధవ్ బుర్రా తెలిపారు. కాగా, ఈ డాక్టరేట్ ప్రదానోత్సవానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. సాయిమాధవ్ కు అభినందనలు తెలిపారు. తెనాలి చెందిన పలువురు కళాకారులు, కళాసంస్థల నిర్వవహకులు హర్షం వ్యక్తం చేశారు.

రవితేజ చిత్రం 'ధమాకా' కు సినెటేరియా ఫిలిం బ్రాండింగ్

రవితేజ చిత్రం 'ధమాకా' కు సినెటేరియా ఫిలిం బ్రాండింగ్ 'మాస్ మహారాజా' రవితేజ నటిస్తున్న 69వ చిత్రం "ధమాకా" కు, ప్రముఖ ఇన్-ఫిలిం బ్రాండింగ్ సంస్థ సినెటేరియా మీడియా వర్క్స్ బ్రాండింగ్ అందిస్తోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ చిత్ర దర్శకులు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో రవితేజకు శ్రీలీల జతగా న టిస్తోంది. ప్రముఖ నటులు జయరాజ్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, రావు రమేష్, చిరాగ్ జానీ, ప్రవీణ్, శ్రీమతి తులసి, శ్రీమతి రాజశ్రీ నాయర్, శ్రీమతి పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలోని పలు బ్రాండింగ్ ప్లేస్మెంట్ ల కోసం ప్రముఖ కార్పోరేట్ కంపెనీలతో ప్రొడక్ట్ ప్లేస్మెంట్ కోసం సినెటేరియా బ్రాండింగ్ ఒప్పందాలను కుదురుస్తోంది. మరిన్ని వివరాలకోసం సినెటేరియాను సంప్రదించండి. లేదా వెబ్ సైట్ లో చూడండి.: Website in English: http://cinetaria.in వెబ్ సైట్ తెలుగులో: http://cinetaria.in/t-index.html సినెటేరియా మీడియా వర్క్స్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా ఫోన్:...

తెలుగు నాటక ప్రచురణలో విప్లవం

తెలుగు నాటక ప్రచురణలో విప్లవం ✍️ ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ఆచార్య ఆత్రేయ మరణించినప్పుడు తెలుగులో నాటకం ఎందుకు బలహీనపడిందంటూ సుదీర్ఘమైన చర్చ జరిగింది. అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమైనాయి. నాటకాలు బలంగా రావడం లేదనీ, నాటకాలకు ప్రోత్సాహం లేదనీ, సినిమా ఆధిపత్యం ఎక్కువ కావడమనీ - ఇలా రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి.  ఇదలా ఉంచితే, తెలుగు సమాజంలో పఠన ప్రక్రియలకున్న ప్రాధాన్యం దృశ్య ప్రక్రియ - నాటకానికి లేదు. నాటక రచన తక్కిన ప్రక్రియలతో పోలిస్తే సంఖ్యలో పరిమితమే. మిగతా ప్రక్రియలకు రచన, ప్రచురణ అనే రెండు పనులే. నాటకానికి రచన, ప్రచురణ (అంతా కాకపోయినా) ప్రదర్శన అనే మూడో పని ఉంది. ప్రదర్శించకపోతే నాటకం ఎందుకు? అనే ప్రశ్న కలుగుతుంది. తెలుగులో నాటకాలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. వచ్చే నాటకాలను నాటక సంస్థలు పట్టించు కున్నంతగా సాహిత్య విమర్శకులు పట్టించుకుంటున్నారా? అన్నది ప్రశ్న. తెలుగు నాటకాలు, నాటికలు, ఏకాంకికలు సంకలనాలుగా వచ్చింది చాలా తక్కువ. నాటికలు వచ్చాయి గానీ, సమగ్ర నాటకాలు సంపుటాలుగా సంకలనం కాలేదు. ఇదొక పెద్ద లోపం. ఆ లోపాన్ని సరిదిద్దుతూ వల్లూరు శివప్రసాద్‌, గంగోత్రి సాయి స...

తెనాలిలో ఈ నెల 19 న కార్తీక దీపోత్సవం

తెనాలిలో ఈ నెల 19 న కార్తీక దీపోత్సవం..

http://www.solydglobaledu.com

http://www.solydglobaledu.com/

ఈ నెల 16న రావణలంక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా ముగిసిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సం

ఘనంగా ముగిసిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సం   - చిత్రోత్సవంలో సందడి చేసిన సినీ ప్రముఖులు  - పలు దేశాల సందేశాత్మక సినిమాల ప్రదర్శన  - బాలల నుంచి విశేష స్పందన తెనాలి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో గతరెండు  రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం సోమవారం ఘనంగా ముగిసింది. స్థానిక కొత్తపేట తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ, తెనాలి పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో చిత్రోత్సవాలు జరిగాయి. సినిమాల్లోని మంచిని మాత్రమే గ్రహించాలని, చెడును వదలి వేయాలని విచ్చేసిన సినీ రంగ ప్రముఖులు పేర్కొన్నారు. చిత్రోత్సవాలను తిలకించి విజయవంతం చేసిన ప్రభుత్వ, ప్రవేటు విద్యా సంస్థల విద్యార్ధులకు నిర్వహకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభలో సొసైటీ చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ చిత్రోత్సవానికి సహకరించిన శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పురపాలక సంఘానికి  కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నుంచి తెనాలి డివిజన్ లో విద్యాసంస్థలో చిత్రాలను సొసైటీ ద్వారా ప్రదర్శిస్తున్నట్లు పేర్క...

ఉత్తమ సినిమాలు ఆలోచనా పరిధిని పెంచుతాయి

ఉత్తమ సినిమాలు ఆలోచనా పరిధిని పెంచుతాయి   • ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నెలకోసారి       ఉచిత సినిమా ప్రదర్శన   . సందేశాత్మక చిత్రాలను ప్రోత్సహించాలి  . కళల కాణాచి తెనాలిలో కల్చరల్ ఫిల్మ్ సొసైటీ కళా     సేవలు అభినందనీయం  - అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ప్రారంభ సభలో శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్  తెనాలి: ఉత్తమ సినిమాలు సృజనాత్మకతతో ఆలోచనా పరిధిని పెంచుతాయని, వినోదంతో పాటు విజ్ఞానంతో రూపొందుతున్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ, తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానికి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రమ్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఆదివారం ఉదయం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న శివకుమార్ చిత్రోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ...