రూ.15 లక్షల వేతన ఉద్యోగం సాధించిన విజ్ఞాన్స్‌ విద్యార్థి

రూ.15 లక్షల వేతన ఉద్యోగం సాధించిన విజ్ఞాన్స్‌ విద్యార్థి

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన శ్రీపతి వంశీకృష్ణ అనే విద్యార్థి రూ.15 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగం సాధించాడని ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థికి ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సీఎస్‌ఈ విభాగానికి చెందిన నాలుగో సంవత్సరం విద్యార్థి శ్రీపతి వంశీకృష్ణ ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీ సిస్కో సిస్టమ్స్‌కు ఎంపికయ్యాడని తెలియజేసారు. ఈ విద్యార్థి ఏడాదికి రూ.15 లక్షల వార్షిక వేతనం అందుకోనున్నాడని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వంశీకృష్ణ వివిధ రకాల క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనడంతో పాటు ఎన్‌పీటీఈఎల్, కోర్సెరా, ఎడ్యుస్కిల్స్‌ వంటి కోర్సులను పూర్తి చేయడం వలనే ఉన్నత కంపెనీలో ఉద్యోగం సాధించాడని వెల్లడించారు. శ్రీపతి వంశీకృష్ణకు మొదటి సంవత్సరం నుంచి యూనివర్సిటీ ఫీజులో 50 శాతం రాయితీను కూడా అందించిందన్నారు. సిస్కో సిస్టమ్స్‌ కంపెనీలో రూ.15 లక్షల వార్షిక వేతనం ఉద్యోగం సాధించిన  శ్రీపతి వంశీకృష్ణను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అభినందించారు.