ఘనంగా ముగిసిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సం

ఘనంగా ముగిసిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సం 

- చిత్రోత్సవంలో సందడి చేసిన సినీ ప్రముఖులు 
- పలు దేశాల సందేశాత్మక సినిమాల ప్రదర్శన 
- బాలల నుంచి విశేష స్పందన తెనాలి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో గతరెండు 
రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం సోమవారం ఘనంగా ముగిసింది. స్థానిక కొత్తపేట తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ, తెనాలి పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో చిత్రోత్సవాలు జరిగాయి. సినిమాల్లోని మంచిని మాత్రమే గ్రహించాలని, చెడును వదలి వేయాలని విచ్చేసిన సినీ రంగ ప్రముఖులు పేర్కొన్నారు. చిత్రోత్సవాలను తిలకించి విజయవంతం చేసిన ప్రభుత్వ, ప్రవేటు విద్యా సంస్థల విద్యార్ధులకు నిర్వహకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభలో సొసైటీ చైర్మన్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ చిత్రోత్సవానికి సహకరించిన శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పురపాలక సంఘానికి  కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నుంచి తెనాలి డివిజన్ లో విద్యాసంస్థలో చిత్రాలను సొసైటీ ద్వారా ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, ఉపాధ్యక్షులు రామరాజు, సభ్యులు జి. వెంకట రత్నం లు ఉత్తమ చిత్రాలను తిలకించడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న  బాలీఉడ్ చైల్డ్ స్టార్ భాను ప్రకాష్ తన డాన్స్, నటన , కర్రసాము ప్రదర్శించి అబ్బురపరచాడు. బ్రీత్ లెస్ డైలాగ్ లు చెప్పి ప్రేక్షకులను మెప్పించాడు. చిత్రోత్సవంలో త్వరలో విడుదల కాబోతున్న కళ్యాణమస్తు చిత్రయూనిట్ సందడి చేసారు. ఆట, పాటలతో ఉత్సాహం నింపారు. చిత్ర కథానాయకుడు శేఖర్ వర్మ, కథానాయికి  వైభవి రాజ్, నిర్మాత బోయపాటి రఘబాబు, దర్శకుడు ఓంసాయి, కోడైరెక్టర్ రాంకీ, కొరియోగ్రాఫర్ పట్టణానికి చెందిన సుధీర్ లతో పాటు దర్శకులు ఎ. సురేష్, సొసైటీ సభ్యులు మురళీ, కౌషిక్, కనపర్తి రత్నాకర్, శ్రీకాంత్ మునిపల్లి, చౌదరి, బెల్లంకొండ వెంకట్, తదితులు పాల్గొన్నారు అతిధులను సొసైటీ జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.