కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటూ ప్రకటన చేయడం హర్షంనీయం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్



టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:

యేడాది కాలంగా రైతుల సాగిస్తున్న ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటూ ప్రధాని ప్రకటన చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్) ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ (ఎ.పి.బి.జె.ఎ)లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో దేశంలోని కార్మికుల కోసం ఉన్న చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు కోట్లను ప్రవేశపెట్టారు. రద్దయిన చట్టాల్లో వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన రెండు చట్టాలు కూడా ఉన్నాయి. ఈ చట్టాల రద్దు కోరుతూ పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జర్నలిజం మిలిగిన వృత్తుల కంటే భిన్నమైనదని, ప్రత్యేకమైనదని కనుక ఆ చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దులో భాగంగా ఈ రెండు చట్టాలను కూడా రద్దుల జాబితాలో చేర్చింది. దేశవ్యాప్తంగా కార్మికలోకం కార్మిక చట్టాల రద్దును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నది. దేశంలోని జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్టు (ఎన్.ఎ.జె) దాని అనుబంధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టు సంఘాలు కార్మికులతో కలిసి ఆందోళనలో భాగం పంచుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి రైతు చట్టాలను ఉపసంహరించుకున్న రీతిలోనే కార్మిక చట్టాల విషయంలలో పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సుప్రీంకోర్టు జర్నలిస్టు చట్టాల విషయంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని జర్నలిజం వృత్తికి గల ప్రత్యేకత, ప్రాధాన్యత దృష్ట్యా వర్కింగ్ జర్నలిస్టు చట్టాన్ని, వేతన నిర్ణయ చట్టాన్ని కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్సు ఫెడరేషన్ (ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్సు అసోసియేషన్ (ఎ.పి.బి.జె.ఎ)లు కోరుతున్నాయి.