కవితా తోటమాలికి

పాటల వేటగానికి
మాటల భావ మౌనికి
కవితా తోటమాలికి
అక్షర అశ్రుతాంజలి!

సాహితీ బాటసారికి
స్మిత మిత వచో శౌరికి
గీతా గానధారికి 
అక్షర అశ్రుతాంజలి!

సాదర స్నేహశీలికి
ప్రియతమ ప్రేమ పాణికి
పదముల ధైర్యశాలికి
అక్షర అశ్రుతాంజలి!

కణ కణ కాంతి ద్రోణికి
నవరస కవన వేణికి
విలువల కలువ రేనిక
అక్షర అశ్రుతాంజలి!

అభినవ వాణి బాణికి
శాశ్వత చరిత ప్రాణికి
వెన్నెల సిరుల శ్రేణికి
అక్షర అశ్రుతాంజలి!
             💐🙏🏻💐
         పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి.