తెనాలిలో ఎం అండ్ ఎం మొబైల్ షో రూమ్ ప్రారంభం

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్ర ప్యారిస్ తెనాలి పట్టణం లో బుధవారం అతి పెద్ద మొబైల్ షోరూం ఎం అండ్ ఎం శాఖను ప్రారంభించారు. స్థానిక బోస్ రోడ్ లోని నూతన మొబైల్ షో రూమ్ ను ప్రఖ్యాత సినీ కధానాయకి కామ్నాజెట్మలాని ముఖ్య అతిధిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంతగాల వారికి ఇప్పుడు మొబైల్ రంగం లో పేరుగాంచిన అతిపెద్ద సంస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇండస్ట్రియల్ మేనేజర్ మధు మదన్ మాట్లాడుతూ కేవలం లాభాపేక్ష కాకుండా నాణ్యమైన సేవలను ఎం అండ్ ఎం అందించాలన్నారు. సంస్థ నిర్వాహకులు ఆడం నూర్ భాష షఫీ, విచ్చారపు కృష్ణ గౌడ్, షేక్ వలి లు మాట్లాడుతూ తమ వద్ద ఒప్పో, రెడీమీ, సామ్ సంగ్ అన్నిరకాల మొబైల్స్ తో పాటు లాప్ టాప్ లు అందుబాటు ధరల్లో లభిస్తాయని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ లు ఇస్తున్నట్లు చెప్పారు.