విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకుడికి డాక్టరేట్‌ ప్రధానం

విజ్ఞాన్స్‌ లారా అధ్యాపకుడికి డాక్టరేట్‌ ప్రధానం

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ముక్కు వెంకటయ్యకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఇన్విస్టిగేటింగ్‌ మెకానికల్‌ ప్రాపర్టీస్, మెషినింగ్‌ క్యారక్టెరిస్టిక్స్, కొర్రోజిన్‌ అండ్‌ వేర్‌ బిహేవియర్‌ ఆఫ్‌ ఫైన్‌ గ్రేయిన్డ్‌ జడ్‌ఈ41 మెగ్నిషియం అలాయ్‌ ప్రొడ్యూస్డ్‌ బై ప్రిక్షన్‌ స్టిర్‌ ప్రాసెసింగ్‌’’ అనే అంశంపై  పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ప్రొఫెసర్‌ డాక్టర్‌ కే.వెంకటరావు గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా 4 పేపర్లు ప్రచురించారు. ఇందులో 2 పేపర్లు స్కోపస్, 2 ఎస్‌సీఐఈ పేపర్లు, 3 ఇంటర్‌ నేషనల్‌ పేపర్లు, ఒక ఇండియన్‌ పేటెంట్‌ సాధించారని పేర్కొన్నారు.