జెఎంజె కళాశాల్లో ఎన్‌సిసి డే


ప్రన్యూషను అభినందిస్తున్న కళాశాల బృందం 

జెఎంజె కళాశాల్లో ఎన్‌సిసి డే  

టాలెంట్ ఎక్స్ ప్రెస్ తెనాలి :

స్థానిక జెంఎజె మహిళా కళాశాల్లో ఆదివారం ఎన్‌సిసి డే నిర్వహించారు. ఎన్‌సిసి ఆంధ్రా బాలికల బెటాలియన్ ఆధ్వర్యంలో 73వ ఎన్‌సిసి డే వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా ఆర్ వి ఆర్ జేసి ఇంజినీరింగ్ కళాశాల ఎఎస్ఆ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ జె.ఉషాక్రాంతి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఎస్సిసితో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం సీనియర్ ఆఫీసర్ జె.ప్రన్యూషను సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్  షైనీ, వైస్ ప్రిన్సిపల్ అరుణారాణి, ఎఎస్ఆ లెఫ్టినెంట్ పాముల కీర్తన పాల్గొన్నారు.