తెలుసా...మనసా...!

తెలుసా...మనసా...!

పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డ అన్నా...,
శివరంజని,భవభంజని అన్నా...,
భద్రం బి కేర్ ఫుల్ బ్రదర్ అన్నా..,
మంచు తాకిన ఈవనం అన్నా..,
కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు అన్నా...,
బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది అన్నా..,
బలపం పట్టి భామ బళ్లో అన్నా...,
అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్రమందామా అన్నా..,
సంతోషం సగం బలం అన్నా..,
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా అన్నా...,
సామాజవరగమనా అన్నా...
ఇలా ఏరసమైనా అతని కలం చివరన పాదరసమే..!
సందర్భమేదైనా, ఎలాంటి విషయమైనా సీతారాముని సాహిత్యోప్రవేశం అనితర సాధ్యం...!
ఆదిభిక్షువుని ఆవహించుకున్న సాహిత్య పిపాసి..,
గ్రాంథిక,అంత్య ప్రాసలతో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా సాహిత్యాన్ని కొంగ్రొత్త తీరాలవైపు తీసుకెళ్లిన అమృత హృదయుడు..,
అసభ్యతకు తావులేని రాత, తత్సంప్రదాయాల కలబోత..,
ఆయన అక్షర తూణీరాలను నిలువెల్లా నింపుకున్న తెలుగువారు కోకొల్లలు..
తెలుగు సినిమా,పాట ఉన్నంతకాలం ఈయన సాహిత్యం నిత్య నూతనం...మనందరి మదిలో, గొంతులో, మనసులో పదిలం...
      
#teampalletour❤️🙏🏻 😓#palletour💚  #ripsir