అక్షరాల మాంత్రికుడు అలసినాడేమెా..

అక్షరాల మాంత్రికుడు అలసినాడేమెా
జగమంతా కుటుంబం నాదని
ఏది శాశ్వతం కాదని హితమేదో చెపుతుా
జామురాతిరంటుా జాబిలమ్మ కబుర్లెన్నో పోసి
ఒప్పుకోవద్దు ఓటమి అని
సందేశాత్మక సుాచనలే కుార్చి
నమ్మకు నమ్మకు ఈ రేయి అంటుా
జాగృతి పరుస్తుా
కళ్ళలో కళ్లుపెట్టి చుాడు అంటుా ప్రేమసందేశం జోడిస్తుా
బోటని పాటముందని యువతను ఆకర్షిస్తుా
సాహిత్యాన్ని విప్లవాన్ని జోడిస్తుా
నిగ్గదీసి అడగమంటుా సమాజాన్ని ప్రశ్నిస్తుా
అక్షరాలు ముద్దాడిన రాగాల అద్భుతాలను అందిస్తుా
సిరివెన్నెల జిలుగులై రాలిన పదాలను తాకిన
గేయాలన్ని అద్భుతాలై
భావాల పల్లకిలో అలలై కలలై
నిత్యం వలపులని తలపులని
గెలుపులని నిజాలని సత్యాలై
హృది తడిపే పాటల ఏరులై
మనసంతా నువ్వేనని వెన్నెల కురిపించి
తెలుగువారి వాకిటిలో
స్వర్ణకమలాలే పుాయించి
సామజవరగమనంటుా హృదయాలను ఉర్రుాతలుాగించి
ముందు తరాలకు మార్గదర్శియై
పదకొండు నంది ఆవార్డులకే వన్నెతెచ్చి
పద్మశ్రీ ఆవార్డు మెప్పుపొంది
రాసిన ప్రతి గేయం అపురుాపమై
తనదంటుా ఏమిలేదని ప్రజాల మది గుడియె గుడిగంటలని
శృతిలయలలో ఐక్యమై
కవిగా రచయితగా గాయకుడిగా రచయితగా
తెలుగు బాషకు నీరాజనమే పట్టి
విలువల శిఖరమెక్కి...

అర్ధరాత్రి సుార్యుడు గగనానికేగినాడు.
తెలుగువారి వాకిటిలో సిరివెన్నెలకురిపిస్తుా...
మదిగదిలో చెరగని జ్ఞాపకాలనునింపేస్తుా...

శ్రీ సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి మరణానికి చింతిస్తుా
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తుా🙏🙏🙏

                 మీ అరుణ సందడి✍