ఇక పై ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలు

ఇక పై ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలు

- దోపిడీని అడ్డుకునేందుకే ఆన్‌లైన్‌ టికెట్ల విధానం    మంత్రి పేర్ని నాని

టాలెంట్ ఎక్స్ ప్రెస్: సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఏపీ రవాణా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను విక్రయించడం, నిర్దేశిత ఆటలతోనే సినిమాలు ప్రదర్శించడం, పన్ను ఎగవేతను అడ్డుకోవడమే ఈ విధానం లక్ష్యమన్నారు.