సవాళ్లను స్మార్ట్‌గా అధిగమించాలి

సవాళ్లను స్మార్ట్‌గా అధిగమించాలి

  ఇంటర్నేషనల్‌ మోటివేషనల్‌ స్పీకర్, యూత్‌ కౌన్సిలర్, గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ విజేత రాధేశ్యామ్‌ దాస్‌

  విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా ఆర్ట్‌ ఆఫ్‌ స్మార్ట్‌ వర్క్‌పై ప్రత్యేక అతిథి ఉపన్యాసం

విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్మార్ట్‌ వర్క్‌తో స్మార్ట్‌గా అధిగమించాలని ఇంటర్నేషనల్‌ మోటివేషనల్‌ స్పీకర్, యూత్‌ కౌన్సిలర్, గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ విజేత రాధేశ్యామ్‌ దాస్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ యాక్టివిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ‘‘ ఆర్ట్‌ ఆఫ్‌ స్మార్ట్‌ వర్క్‌’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ యూత్‌ కౌన్సిలర్, గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ విజేత రాధేశ్యామ్‌ దాస్‌ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో మూడు ( బుక్‌ ఆఫ్‌ యువర్‌ లైఫ్, సెల్ఫ్‌ టెస్ట్‌ పర్సనాలిటీ టైప్, స్మార్ట్‌ టైమ్‌ మేనేజర్‌) టిప్స్‌ను పాటించాలన్నారు. విద్యార్థులకు క్రియేటివిటీ మైండ్‌ సెట్‌తో పాటు అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ థింకింగ్‌ ఉండాలన్నారు. విద్యార్థలు ప్రతిరోజు మెడిటేషన్, యోగ, ప్రాణాయామంలు చేయడంతో పాటు రిలేషన్‌షిప్‌ బిల్డింగ్, సబ్జెక్ట్‌ ట్రైనింగ్, స్టడీ ప్లానింగ్‌ ఉండాలన్నారు. విద్యార్థులు సోషల్‌ సామాజిక మాధ్యమాలను వినియోగిస్తూ సమయాన్ని వృథా చేసుకోరాదన్నారు. విద్యార్థులకు మొదట థింకింగ్‌తో పాటు విజన్‌ను ఏర్పరుచుకుని ఆచరణలో పెట్టాలన్నారు.  విద్యార్థులకు మంచితనం(సత్వ గుణ), అభిరుచి (రజోగుణ)లను పెంచుకుని అజ్ఞానం(తమో గుణ) విడనాడాలన్నారు. విద్యార్థులకు స్మార్ట్‌ వర్క్‌కు హార్డ్‌ వర్క్‌కు మధ్యనున్న తేడాలను వివరించారు. విద్యార్థులు ఏ విషయాన్ని అయినా వాయిదా వేయకూడదని, ఇతరుల గురించి వేరేవాళ్ల దగ్గర మాట్లాడటం మానేసి అందరితో విధేయతగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్‌ పోటీలను నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ చూపిన మొదటి 15 మంది విద్యార్థులకు బహుమతులను అందజేయడంతో పాటు 500 మంది విద్యార్థులకు ఐఐటీ బాంబేకు చెందిన పూర్వ విద్యార్థుల చేత ఉచిత మోటివేషన్‌ క్లాసులను నిర్వహించనున్నారు.