గుంటూరు రైల్వే డివిజన్‌లోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలి

*గుంటూరు రైల్వే డివిజన్‌లోని పలు రైల్వే సమస్యలకు పరిష్కారం కోరుతూ.. నేడు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని విష్ణవ్‌ గారిని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కలిశారు.*

▪️ గుంటూరు రైల్వే స్టేషన్‌ రిమోడలింగ్‌ (పునర్మిర్మాణం) ప్రక్రియను కొనసాగించాలని..  రిమోడలింగ్‌కు ఎన్నో ఏళ్ల తర్వాత రూ.80కోట్లు కేటాయించబడ్డాయని, అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం రద్దు చేయబడిందని, మంజూరైన నిధులను ఇతర రైల్వే డివిజన్‌లకు కేటాయిస్తున్నారని మంత్రి గారికి విన్నవించారు.  రాష్ట్రంలో గుంటూరు రైల్వే స్టేషన్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. నిధులు మరలా  కేటాయించి ప్రాజెక్ట్ ను కొనసాగించాలని కోరారు.

▪️ ప్రజలు, రైతుల ప్రయోజనాల దృష్ట్యా లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ల స్థానంలో అవసరమైన చోట ఆర్‌యుబిలు, ఆర్‌ఓబీల నిర్మాణాలు చేపట్టాలని...
 గుంటూరు డివిజన్‌లోని లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ల సంఖ్యలు– 27, 40, 53, 64, 81, 89, 106, 263, 264, 257, 269, 283, 287, 50, 57, 60, 61, 69, 71, 72, 75, 80 గేట్‌లను మార్చాలని విన్నవించారు.

▪️అలాగే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (02795) నడికుడి జంక్షన్‌లో ఆపాలని..
▪️ ఫలక్‌నూమా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(02704) సత్తెనపల్లిలో ఆగుట గురించి..విన్నవించారు.

▪️ ప్రస్తుతం ఉన్న గుంటూరు– గుంతకల్లు మార్గానికి అనుసంధానించే న్యూపిడుగురాళ్ల– శావల్యాపురం మధ్య కొత్త లైన్‌ పూర్తి దశలో ఉందని,. ఇది సికింద్రాబాద్‌– వినుకొండకు నేరుగా రైల్‌ సౌకర్యం కల్పిస్తోందని, ఇప్పటికే  నల్లపాడు – నంద్యాల సెక్షన్‌ విద్యుదీకరించబడినందున చాలా ఉపయోగకరంగా ఉందని, అలాగే ఈ కనెక్షన్‌లో మిగతా విద్యుదీకరణ పనులు త్వరగా పూర్తి చేసి లైన్‌ను ప్రారంభించాలని కోరారు
#MpLavuSrikrishnadevarayalu