విజ్ఞాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా ఆధ్వర్యంలో ఉచిత లీగల్‌ ఎయిడ్‌ క్యాంప్‌

విజ్ఞాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా ఆధ్వర్యంలో ఉచిత లీగల్‌ ఎయిడ్‌ క్యాంప్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో తెనాలి సమీపంలోని అంగళకుదురులో ఉచిత లీగల్‌ ఎయిడ్‌ క్యాంప్‌ను నిర్వహించామని వర్సిటీ లా డైరక్టర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లా డైరక్టర్‌ మాట్లాడుతూ ఇటువంటి ప్రోగ్రామ్స్‌ వల్ల కోర్టుకు వెళ్లకుండానే గ్రామంలోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ పెరుగుతుందన్నారు. గ్రామానికి చెందిన ఒక గృహ హింస కేసుకు తగిన పరిష్కారం అందించి వారికి కౌన్సిలింగ్‌ చేశామన్నారు. అంతేకాకుండా అట్రాసిటీ కేసుకు సంబంధించి సలహాను ఇవ్వడం జరిగిందన్నారు. చట్ట పరిమితిలో అవకాశం ఉన్న భూ వివాదం కేసుకు పరిష్కార సూచనను అందించామన్నారు. కోర్టుకు వెళ్లకుండా పరిష్కార మార్గాలు ఉన్నాయి... అవి మన గ్రామ పరిధిలోనే పరిష్కరించుకోవచ్చు. అందులో మీడియేషన్, కన్సీలియేషన్‌ మరియు కౌన్సిలింగ్స్‌ ద్వారా 90 శాతం కేసులు పరిష్కారం అవుతాయని గ్రామస్తులకు వెల్లడించారు. ఈ విధంగా చాలా కేసులకు గ్రామాల్లోనే పరిష్కారం చూపడం వలన కోర్టుల భారాన్ని తగ్గించవచ్చన్నారు. కక్షి దారు యొక్క సమయాన్ని, డబ్బును ఆదా చేయవచ్చన్నారు. ఈ విధమైన లీగల్‌ ఏయిడ్‌ క్యాంప్స్‌ను వర్సిటీ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయితీలో నిర్వహిస్తామని, ఇంకా ఎవరైనా లీగల్‌ సమస్యలు ఉన్నవాళ్లు  విజ్ఞాన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా డిపార్ట్‌మెంట్‌లోని లీగల్‌ ఏయిడ్‌ సెల్‌ను సంప్రదిస్తే తగిన సలహాలు, పరిష్కారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో లా డిపార్ట్‌మెంట్‌ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.