విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి ఆస్ట్రేలియన్‌ పేటెంట్‌

విజ్ఞాన్స్‌ అధ్యాపకుడికి ఆస్ట్రేలియన్‌ పేటెంట్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కొణిదల సతీష్‌ కుమార్‌కు ఆస్ట్రేలియన్‌ పేటెంట్‌ మంజూరైందని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ కంప్యూటర్‌– ఏయిడెడ్‌ మాలిక్యులర్‌ డాకింగ్, ఫిజికో కెమికల్‌ అండ్‌ ఏడీఎంఈటీ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ నోవల్‌ బ్రోమోపిరిమిడిన్‌ అనాల్గ్స్‌ యాస్‌ పొటెన్షియల్‌ ఆంటీ–క్యాన్సర్‌ ఏజెంట్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను ప్రముఖ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీస్‌ ఆస్ట్రేలియన్‌ అథారిటీ పేటెంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. ఈ పేటెంట్‌ ద్వారా కొత్త క్యాన్సర్‌ నిరోధక బ్రోమోపిరిమిడిన్‌ మాలిక్యూల్స్, ఫిజికో కెమికల్స్, ఏడీఎంఈటీ లక్షణాలను ఇన్‌సిలికో పద్ధతుల ద్వారా అన్వేషణను హక్కులుగా వచ్చే 8 సంవత్సరాల పాటు పొందారని పేర్కొన్నారు. ఈ పేటెంట్‌ను యూఏఈలోని అజ్మాన్‌ యూనివర్సిటీ, బెంగళూరులోని బీఎంఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, పంజాబ్‌లోని శ్రీసాయి ఫార్మసీ కళాశాల, బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలోని అధ్యాపకలతో సంయుక్తంగా ఆస్ట్రేలియన్‌ పేటెంట్‌ను పొందారని వెల్లడించారు.